
కేతిరెడ్డి, జితేంద్ర, ఏక్తా కపూర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె, నిర్మాత ఏక్తా కపూర్‌కి ఇటీవల పద్మశ్రీ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఆమెకు అభినందనలు తెలియజేశారు దర్శక–నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ‘‘ఈ అవార్డుకి ఏక్తా అర్హురాలు. చిన్న వయసులో పద్మశ్రీ పురస్కారం అందుకోవడానికి ఆమె పట్టుదల, క్రమశిక్షణే కారణం’’ అన్నారు కేతిరెడ్డి. ఆయన తీస్తున్న ‘శశి లలిత’ (జయలలిత బయోపిక్) చిత్రానికి ఆశీస్సుల కోసం షిరిడీ సందర్శించారు కేతిరెడ్డి.