Naagin 6 Update: Ekta Kapoor Nagin 6 Season On A Budget Of 130 Crores - Sakshi
Sakshi News home page

Nagin 6: రూ. 130 కోట్ల బడ్జెట్​తో సీరియల్ !​​.. ఒకవేళ హిట్​ కాకుంటే

Published Wed, Feb 2 2022 9:01 AM | Last Updated on Wed, Feb 2 2022 9:32 AM

Ekta Kapoor Nagin 6 Season On A Budget Of 130 Crores - Sakshi

హిందీ బుల్లితెర ప్రేక్షకులను అలరించే మోస్ట్ పాపులర్​ సీరియల్​లో 'నాగిని' ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్​ ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తెలుగులో కూడా 'నాగిని' మొదటి రెండు సీజన్​లను ప్రసారం చేశారు. ఆ సీజన్స్​కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సీరియల్​ ఆరో సీజన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హిందీ బిగ్​బాస్​ సీజన్​ 15 విన్నర్ తేజస్వీ ప్రకాష్​ ప్రధాన పాత్రలో అలరించనుంది. 

అయితే తాజాగా ఈ సీరియల్​ గురించి ఒక ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్​ లైఫ్​లోని ఒక నివేదిక ప్రకారం ఈ సీజన్​ను రూ. 130 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందించినట్లు సమాచారం. ​ఒకవేళ ఈ సీజన్​ అంతగా హిట్​ కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఈ ఫ్రాంచైజీని ఆపేయాలని భావిస్తుందట నిర్మాత ఎక్తా కపూర్​. ఈ భారీ బడ్జెట్​తో ఒక సినిమానే తీయొచ్చని ఎక్తాకు పలువురు చెప్పినా ఎక్తా కపూర్​ వినలేదని తెలుస్తోంది. నాగిని 6లో విజువల్ ఎఫెక్ట్స్​ భారీగా ఉంటాయని సమాచారం. ఈ సీజన్ ఫిబ్రవరి 12 నుంచి కలర్స్​ ఛానెల్​లో ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారం కానుంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement