huge budget
-
రూ. 130 కోట్ల బడ్జెట్‌తో సీరియల్ !.. ఒకవేళ హిట్ కాకుంటే
హిందీ బుల్లితెర ప్రేక్షకులను అలరించే మోస్ట్ పాపులర్ సీరియల్లో 'నాగిని' ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తెలుగులో కూడా 'నాగిని' మొదటి రెండు సీజన్లను ప్రసారం చేశారు. ఆ సీజన్స్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సీరియల్ ఆరో సీజన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్ తేజస్వీ ప్రకాష్ ప్రధాన పాత్రలో అలరించనుంది. అయితే తాజాగా ఈ సీరియల్ గురించి ఒక ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లైఫ్‌లోని ఒక నివేదిక ప్రకారం ఈ సీజన్‌ను రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. ఒకవేళ ఈ సీజన్ అంతగా హిట్ కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఈ ఫ్రాంచైజీని ఆపేయాలని భావిస్తుందట నిర్మాత ఎక్తా కపూర్. ఈ భారీ బడ్జెట్‌తో ఒక సినిమానే తీయొచ్చని ఎక్తాకు పలువురు చెప్పినా ఎక్తా కపూర్ వినలేదని తెలుస్తోంది. నాగిని 6లో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని సమాచారం. ఈ సీజన్ ఫిబ్రవరి 12 నుంచి కలర్స్ ఛానెల్లో ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారం కానుంది. Apne bhavya roop aur teeno kaal ki shaktiyon se duniya ko bachane aa rahi hai Naagin. Zaroor dekhiye #Naagin6, 12th February se Sat-Sun, raat 8 baje only on #colors.@itsmetejasswi pic.twitter.com/lEs29HCahX — ColorsTV (@ColorsTV) January 31, 2022 -
ప్రభాస్ హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్.. అన్ని కోట్ల ఖర్చు
Prabhas Salaar Movie Action Sequence With High Budget: పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ 'బాహుబలి' చిత్రం నుంచి ప్రతీ సినిమాను పాన్ ఇండియాగా ఉండేలా చూసుకుంటున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్'తో అద్భుతమైన హిట్‌ను సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ స్క్రీన్‌పైనే మోస్ట్ అవైటెడ్ మూవీగా 'సలార్' మారింది. అయితే ఈ అంచనాలను అందుకోవాలనే తపనతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. కేజీఎఫ్‌లో ఎలాంటి ఫైట్ సీన్స్ తెరకెక్కించాడో మనం చూశాం. అంతకుమించి సలార్ చిత్రంలో యాక్షన్ సీన్స్‌ను రూపొందించనున్నాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమాలోని హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్ చిత్రానికే హైలెట్ కానున్నాయని టాక్. హాలీవుడ్ స్థాయిలో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించనుంది. అలాగే 'సలార్'లో పవర్ఫుల్ విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: 'సలార్'లో ఆ సీన్ రీషూట్.. స్పెషల్ సాంగ్‌లో 'సాహో' బ్యూటీ ? -
340 కోట్లతో వర్మ న్యూక్లియర్
కోట్లకు కోట్ల బడ్జెట్తోనూ, అవసరమైతే లక్షల బడ్జెట్తోనూ సినిమా తీయగల సత్తా ఉన్న నిర్మాతల ఫ్రెండ్లీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తెలుగు ప్రేక్షకులకు తక్కువ బడ్జెట్లో ‘ఐస్‌క్రీమ్’ చూపించిన ఆయనే, ఇప్పుడు హిందీలో అమితాబ్ బచ్చన్‌తో ‘సర్కార్-3’ తెరకెక్కిస్తున్నారు. తాజాగా 340 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘న్యూక్లియర్’ అనే ఇంగ్లీష్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో నటించనున్న ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ రెమ్యునరేషన్ కాకుండా... కేవలం మేకింగ్ బడ్జెట్ మాత్రమే 340 కోట్లు అని చెప్పారాయన. వర్మకు ఇష్టమైన కాన్సెప్ట్ తీవ్రవాదుల నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఒకవేళ తీవ్రవాదుల చేతికి ‘న్యూక్లియర్’ బాంబ్ చిక్కితే.. కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అప్పుడు ప్రపంచం అంతం అవుతుందనేది సినిమా కథ. ఇండియా, అమెరికా, రష్యా, చైనా, యెమెన్లలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాలో ఆ యా దేశాలకు చెందిన నటీనటులు నటించనున్నారు. వర్మ కంపెనీతో కలసి సి.యం.ఎ. గ్లోబల్ సంస్థ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించనుంది. వర్మతో 15 సినిమాలకు ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. ‘సర్కార్-3’ పూర్తయిన వెంటనే ‘న్యూక్లియర్’ స్టార్ట్ అవుతుందని వర్మ తెలిపారు. -
మూడోసారీ భారీ బడ్జెట్
* రూ.1.30 లక్షల కోట్లకు చేరనున్న తెలంగాణ ఆర్థిక ప్రణాళిక * సీఎం సూచన మేరకు కసరత్తును వేగవంతం చేసిన ఆర్థిక శాఖ * నిరుటిలాగే మార్చిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పునరాలోచన * మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హౌసింగ్ పథకాలకు రుణాలే దిక్కు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడోసారి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. 2015-16లో రూ. 1.15 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించే అవకాశాలున్నాయి. ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంత మేరకు తగ్గించి ప్రణాళిక పద్దుపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థికశాఖకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వీటికితోడు వాస్తవికతకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉండాలని సూచిం చారు. దీంతో అధికారులు బడ్జెట్ కసరత్తుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రణాళిక పద్దు కేటాయింపులను ముందుగానే శాఖలవారీగా సమాచారం అందించి వాటి ఆధారంగా జిల్లాల అభివృద్ధి కార్డులను తయారీ చేసే కొత్త పంథాను అనుసరిస్తామని సీఎం ఇటీవలే ప్రకటించారు. జనవరి మొదటి వారంలోనే ఈ కసరత్తు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల ప్రక్రియ ఇప్పటికీ జరగలేదు. సీఎం ఆదేశాలతో హడావుడి పడ్డ ఆర్థిక శాఖ ప్రాథమికంగా శాఖల వారీ కేటాయింపుల జాబితా తయారు చేసింది. కానీ సంక్రాంతి తర్వాత జరిగిన సమీక్షలో ఆర్థికశాఖ ఇచ్చిన ఈ జాబితాకు సీఎం ఆమోదముద్ర వేయలేదని తెలిసింది. వాస్తవికతకు అద్దం పట్టేలా కేటాయింపులు లేవని, మరోసారి పునః సమీక్షించాలని సీఎం సూచించినట్లు సమాచారం. మిగతా శాఖల అధికారులతో చర్చించాక కేటాయింపుల విషయంలో తుది నిర్ణయం తీసుకుందామని సీఎం అభిప్రాయపడ్డట్లు తెలిసింది. దీంతో శాఖలవారీగా సీలింగ్ బడ్జెట్ ప్రకటించే ప్రక్రియ పెండింగ్‌లో పడింది. కీలక పథకాలపై ఊగిసలాట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కొన్ని పథకాలను ఈసారి బడ్జెట్లో పొందుపరుస్తారా..? లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంటింటికీ నల్లా నీటిని అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు దాదాపు రూ.30 వేల కోట్లు కావాలి. ఈ మొత్తాన్ని వివిధ సంస్థల నుంచి రుణం ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాలకు సైతం రుణాలపైనే ఆధారపడుతోంది. నాబార్డు, హడ్కో, ఎల్ఐసీ, రాష్ట్ర బ్యాంకర్ల సమితి నుంచి వీటికి రుణాలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో ప్రణాళిక పద్దులో వీటి ప్రస్తావన లేకుండా బడ్జెట్‌ను మిగతా పథకాలకు, పనులకు సర్దుబాటు చేయాలని యోచి స్తోంది. ఈ ఏడాది ప్రణాళిక పద్దు దాదాపు రూ. 62 వేల కోట్లకు చేరుతుందని అంచనా. బడ్జెట్లో 18 శాఖలవారీగా నిధుల కేటాయింపులుంటా యి. ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించినట్లు నీటిపారుదలశాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయిస్తే మిగతా రూ. 37 వేల కోట్లను ఇతర శాఖలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు జనాభా ప్రకారం నిధులు కేటాయించటం తప్పనిసరి. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 15.44 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్‌కు 9.34 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. 2015-16 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం రూ. 11,450 కోట్లు కేటాయించింది. ప్రణాళిక పద్దు పెరిగిన దామాషా ప్రకారం వచ్చే బడ్జెట్లో ఇది కాస్తా రూ.15 వేల కోట్లకు చేరుతుంది. దీంతో మిగతా రూ. 22 వేల కోట్లను ఇతర విభాగాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకే కొన్ని పథకాలకు బడ్జెట్లో ఆర్థిక కేటాయింపుల్లేకుండానే రుణాల సమీకరణ ద్వారా చేపట్టే వెసులుబాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు తాజా పరిణామాలతో బడ్జెట్ సమావేశాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ కంటే ముందే...అంటే జనవరి నెలాఖరునే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి ఫిబ్రవరి మొదటి వారంలోనే బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు జారీ చేసింది. కానీ కొత్తగా ఎంచుకున్న బడ్జెట్ తయారీ పంథాతోపాటు గ్రేటర్ హైదరాబాద్, నారాయణఖేడ్ ఉప ఎన్నిక కారణంగా బడ్జెట్ తయారీ ఆలస్యమవుతోంది. గతేడాది మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది కూడా కొంచెం అటుదిటుగా మార్చి మొదటి, రెండో వారంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. -
మహానగర జీవన ‘చిత్రం’
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో పాలిటన్ మహానగర జీవన చిత్రంలో పలు ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులకు కొంగుబంగారమైన ఈ నగరం ప్రపంచ విస్తీర్ణంలో 38వ స్థానం దక్కించుకుంది. ఆసియాలో 22వ స్థానంతో అలరారుతోంది. 95.77 లక్షల జనాభాతో భాసిల్లుతోంది. 2041 నాటికి ఆ సంఖ్య 1.90 కోట్లకు చేరనుంది. హైటెక్ నగర సామాజిక, ఆర్థికాభివద్ధితో పాటు విద్య, లింగనిష్పత్తి, కుటుంబ ఆదాయం, రవాణా తదితర అంశాలపై లీ అసోసియేట్స్ సిద్ధం చేసిన తాజా నివేదికలోని అంశాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. నివేదిక వెల్లడించిన పలు ఆంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అల్పాదాయ వర్గాలే అత్యధికం మహానగరం (హెచ్ఎంఏ) పరిధిలో అల్పాదాయ, మధ్యాదాయం పొందే వేతనజీవు లు, కార్మికులే అత్యధికం. అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు సగటున నెలకు రూ.20,200, అద్దె ఇళ్లలో ఉంటున్న వారు రూ.13,600 ఆర్జిస్తున్నట్లు లెక్కగట్టారు. మురికివాడల్లో నివసించేవారి కుటుంబ ఆదాయం నెలకు రూ.9800 మాత్రమే. హెచ్ఎంఏ పరిధిలో వేతన శ్రేణులిలా ఉన్నాయి. శివార్లలో జన ప్రభంజనం.. జనాభా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అనూహ్యంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 95,77,759గా ఉంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 67,57,552 మంది ఉండగా.. గ్రేటర్‌కు ఆవల మిగతా జనాభా కేంద్రీకృతమైంది. పాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్) పరిధిలో నివసిస్తున్నవారు 39,93,389 మంది మాత్రమే. అంటే గడిచిన దశాబ్ద కాలంలో శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయని తెలుస్తోంది. పోటీతత్వంలో నాలుగో స్థానం పెట్టుబడుల ప్రవాహం, పోటీతత్వం, కొత్త కంపెనీల స్థాపనకు దేశ వ్యాప్తంగా అనుకూలమైన నగరాలను పరిశీలిస్తే (2010కి ముందు స్థితి) హెచ్ఎంఏ ప్రాంతం దేశంలో నాలుగో స్థానంలో ఉంది. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో పారిశ్రామిక, సేవలు, పారిశ్రామిక రంగానికి ఇతోధికంగా తోడ్పాటునందించడంతో ఈ పరిస్థితి ఉండేదని లీ నివేదిక అభిప్రాయ పడింది. మౌలిక వసతులు, ఆర్థికవృద్ధి, పాలన, మానవ సామర్థ్యం, జనాభా, సంపద పంపిణీ, వ్యాపార ప్రోత్సాహకాలు, సంస్థాగత మద్దతు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి 800 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించారు. ఇందులో 2010 నాటికి ఆయా నగరాల స్థానం ఇలా ఉంది.. మహిళల ఉపాధి అత్యల్పం జనాభాలో సగం ఉన్న మహిళలకు హెచ్ఎంఏ పరిధిలో ఉపాధి కల్పన అత్యల్పంగా ఉందని లీ నివేదిక పేర్కొంది. మహిళల్లో ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉపాధి పొందుతున్నవారు 6.3 శాతం కాగా, స్వయం ఉపాధి పొందుతున్నవారు 4.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. మహిళల్లో 77.8 శాతం మంది ఇంటికే పరిమితమవుతున్నారని నివేదిక అంచనా వేసింది. భవిష్యత్‌లో జన విస్ఫోటనమే.. ప్రస్తుతం హెచ్ఎంఏ జనాభా 95.77 లక్షలు ఉండగా, 2015 నాటికి ఇది 1.20 కోట్లకు చేరనుంది. 2041 నాటికి ఏకంగా 1.90 కోట్లకు చేరువకావడం తథ్యమని లీ అసోసియేట్స్ నివేదిక అంచనా వేసింది. మన పొరుగున ఉన్న బెంగళూరులో ప్రస్తుతం 8.5 మిలియన్ల జనాభా ఉండగా..అది 2025 నాటికి 1.22 కోట్లకు చేరనుందని అంచనా. చెన్నై నగర జనాభా ప్రస్తుతం 8.7 మిలియన్లు ఉండగా ఇది 2025 నాటికి 1.28 కోట్లకు చేరడం తథ్యమని తెలిపింది. అక్షరాస్యత ఓకే.. హెచ్ఎంఏ పరిధిలో అక్షరాస్యత 80.5 శాతంగా ఉంది. ఇందులో నామమాత్రపు విద్య (ప్రాథమిక విద్య) పూర్తి చేసినవారు 45.8 శాతం. పట్టభద్రులు 10.2 శాతం, పోస్టు గ్రాడ్యుయేట్లు 3.5 శాతం ఉన్నట్టు నివేదిక లెక్కగట్టింది. పురుషుల్లో అక్షరాస్యులు 84 శాతం ఉండగా.. స్త్రీలలో 76.5 శాతం మందే అక్షరాస్యులని నివేదిక తెలిపింది. సగం మందికి ఉపాధి కరువు హెచ్ఎంఏ పరిధిలో మొత్తం జనాభాలో కేవలం 38.7 శాతం మందికి మాత్రమే ఉపాధి లభిస్తోంది. ఇది 2001లో 34.3 శాతంగా ఉంది. పరిధుల వారీగా ఉపాధి కల్పన శాతాల్లో ఈ విధంగా ఉంది.. తగ్గిన స్త్రీ-పురుష నిష్పత్తి.. చిన్న కుంటుంబంపై అన్నివర్గాల్లో అవగాహన పెరగడంతో కుటుంబ పరిమాణం తగ్గింది. 2001లో సగటు కుటుంబ పరిమాణం ఇంటికి ఐదుగురు సభ్యులుండగా ఇది 2011 నాటికి నలుగురికి చేరింది. స్త్రీ, పురుష నిష్పత్తి చూస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 960 మంది మాత్రమే మహిళలున్నారు. ఆడపిల్లలపై నేటికీ వివక్ష కొనసాగుతున్నట్టు లింగ నిష్పత్తిని చూస్తే తెలుస్తోందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. వసతుల కల్పనకు భారీ బడ్జెట్ అవసరం.. హైదరాబాద్ మెట్రో పాలిటన్ పరిధిలో పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో మౌలిక వసతుల కల్పనకు రూ.3.94 లక్షల కోట్లు అవసరమని లీ నివేదిక అభిప్రాయపడింది. 2012-2017 మధ్య కాలంలో మం చినీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ రహదారులు, ప్రజారవాణ తదితర వసతుల కల్పనకు ఈ నిధులు అవసరమని స్పష్టం చేసింది.