
Prabhas Salaar Movie Action Sequence With High Budget: పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ 'బాహుబలి' చిత్రం నుంచి ప్రతీ సినిమాను పాన్ ఇండియాగా ఉండేలా చూసుకుంటున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్'తో అద్భుతమైన హిట్‌ను సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ స్క్రీన్‌పైనే మోస్ట్ అవైటెడ్ మూవీగా 'సలార్' మారింది. అయితే ఈ అంచనాలను అందుకోవాలనే తపనతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. కేజీఎఫ్‌లో ఎలాంటి ఫైట్ సీన్స్ తెరకెక్కించాడో మనం చూశాం.
అంతకుమించి సలార్ చిత్రంలో యాక్షన్ సీన్స్‌ను రూపొందించనున్నాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమాలోని హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్ చిత్రానికే హైలెట్ కానున్నాయని టాక్. హాలీవుడ్ స్థాయిలో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించనుంది. అలాగే 'సలార్'లో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'సలార్'లో ఆ సీన్ రీషూట్.. స్పెషల్ సాంగ్‌లో 'సాహో' బ్యూటీ ?
Comments
Please login to add a commentAdd a comment