దివ్యశక్తే ఉంటే అలాంటి సినిమాలే చేస్తా
ముంబై: దశాబ్దం కిందట విడుదలైన 'క్రిష్' ఆతర్వాత వచ్చిన 'క్రిష్-3' తప్ప బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సూపర్ హీరో కథల జోలికిపోలేదు. మళ్లీ చాలాకాలం తర్వాత ఆ సాహసం చేస్తున్నారు నిర్మాత ఏక్తా కపూర్. 'ఎ ఫ్లయింగ్ జట్' టైటిల్ తో ఆమె రూపొందించిన సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది. సినిమా ప్రమోషన్ లో బాగంగా ఏక్తా ఇటీవల మీడియాతో మాట్లాడారు.
సూపర్ హీరో సినిమా తీసిన మీరు.. ఏదైనా సూపర్ పవర్ (దివ్యశక్తి) కోరుకుంటారా? అన్న విలేకరుల ప్రశ్నకు.. 'ఏది తిన్నా, ఎంత తిన్నా లావెక్కకుండా ఉండే శక్తి ఏదైనా ఉంటే అలాంది నేను కోరుకుంటా. ఇంకా.. పైరసీ చేయడానికి వీలులేని సినిమాలు చేస్తా' అని బదులిచ్చింది ఏక్తా. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఏక్తా ఇటీవల నిర్మించిన 'ఉడ్తా పంజాబ్', 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' సినిమాలు పైరసీకి గురైన నేపథ్యంలో ఆమె అలా కోరుకోవడం సహజమే. విడుదలకు సిద్ధంగా ఉన్నసినిమా అయినా పైరసీబారిన పడకూడదని కోరుకుందాం. రెమో ఫెర్నాండెజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఎ ఫ్లయింగ్ జట్' లో హీరో ష్రాఫ్ లీడ్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.