
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ తన సంవత్సర జీతాన్ని వదులుకున్నారు. సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన బాలాజీ టెలిఫిల్మ్స్లో పనిచేస్తున్న తన సహోద్యోగులకు సహాయం చేయడానికి సంవత్సరం జీతం రూ. 2.5 కోట్లు వదులుకుంటున్నట్లు ప్రకటించారు "ఈ విపత్కర సమయంలో బాలాజీ టెలిఫిల్మ్స్‌లో పనిచేసే వివిధ ఫ్రీలాన్సర్లు, రోజువారీ వేతన కార్మికులను చూసుకోవడం నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. వరదలు, ఉగ్రవాద దాడులు, బ్యాంక్ సెలవుదినాల్లో కూడా వీళ్లు పనిచేశారు.మా కార్యాలయాన్ని మూసివేయడం ఇదే మొదటిసారి. ఈ కష్టకాలంలో వాళ్లను ఆదుకోవడం చాలా ముఖ్యం. అందుకే నా వంతు సాయంగా ఇది చేస్తున్నాను. ప్రతీ ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వ ఆదేశాలను పాటించండి. ఆరోగ్యంగా ఉండండి". అంటూ పేర్కొన్నారు.
కరోనా వైరస్ కారణంగా అన్ని షూటింగులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. మార్చి 17న ఏక్తాకపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్ కూడా మూతబడింది. ఇక భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 3 వేలు దాటగా, 71 మంది చనిపోయారు. (హై రిస్క్ మహానగరాలకే)
Comments
Please login to add a commentAdd a comment