ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్‌.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ | Producer Ekta Kapoor Tested Positive For Covid 19 | Sakshi
Sakshi News home page

Ekta Kapoor: ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్‌.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ

Jan 3 2022 3:48 PM | Updated on Jan 7 2022 3:51 PM

Producer Ekta Kapoor Tested Positive For Covid 19 - Sakshi

Producer Ekta Kapoor Tested Positive For Covid 19: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ తేడా లేకుండా తన పంజా విసురుతోంది. కరోనా కలకలం బీటౌన్‌లో మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే బీటౌన్‌ ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అర్జున్ కపూర్‌ ఇంట్లో నలుగురికి కొవిడ్‌ సోకగా వారి ఇంటికి బీఎంసీ అధికారులు సీల్‌ వేసి శానిటైజ్‌ చేశారు. కమల్‌ హాసన్‌, కరీనా కపూర్‌, నోరా ఫతేహీతో పాటు తాజాగా జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్‌ కరోనా చేతికి చిక్కారు. వీరితోపాటు టాలీవుడ్‌లో మంచు మనోజ్‌, నమ్రతా శిరోద్కర్‌ సోదరి శిల్పా శిరోద్కర్ మహామ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌ సోమవారం కొవిడ్‌ బారిన పడింది. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఆమె ప్రకటించింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను కొవిడ్‌కు గురయ్యాను. నేను క్షేమంగా ఉన్నాను. నన్ను సంప్రదించిన వారందరూ దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అని ఇన్‌స్టా గ్రామ్‌ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది ఈ 46 ఏళ్ల ఏక్తా కపూర్.
 

ఇదీ చదవండి: జెర్సీ హీరోయిన్‌కు కరోనా.. సురక్షితంగా ఉండండని పోస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement