Tested
-
బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో వైరల్
Varalaxmi Sarath Kumar Tested Covid 19 Positive: కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అనేక చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ 'క్రాక్' సినిమాలో జయమ్మగా, అల్లరి నరేశ్ 'నాంది' మూవీలో లాయర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం తమిళంతోపాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ఫ్యాన్స్‌కు బాధాకరమైన న్యూస్ చెప్పింది. ఆమె కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే, సెట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలి. ఎందుకంటే నటీనటులు అన్నిసార్లు సెట్లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్లందరూ ఇకనైనా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ Covid Positive..inspite of all precautions..actors plz start insisting on masking up the entire crew bcos we as actors cant wear masks.. Those who have met me or been in contact with me plz watch out for symptoms and get checked.. Plz be careful and mask up..covid is still here pic.twitter.com/MyegWOSQ5a — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) July 17, 2022 నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై సెలబ్రిటీలు, నెటిజన్లు 'గెట్ వెల్ సూన్' అని స్పందిస్తున్నారు. 'జాగ్రత్త వరూ.. నీకు మరింత ధైర్యం, బలం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని నటి రాధిక కామెంట్ చేశారు. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సమంత 'యశోద', 'బాలయ్య 107', 'హనుమాన్', 'శబరి' వంటి తదితర చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో చిరంజీవి సమర్పణలో హిందీ చిత్రం.. తెలుగులో.. -
ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ
Producer Ekta Kapoor Tested Positive For Covid 19: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ తేడా లేకుండా తన పంజా విసురుతోంది. కరోనా కలకలం బీటౌన్‌లో మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే బీటౌన్ ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కొవిడ్ సోకగా వారి ఇంటికి బీఎంసీ అధికారులు సీల్ వేసి శానిటైజ్ చేశారు. కమల్ హాసన్, కరీనా కపూర్, నోరా ఫతేహీతో పాటు తాజాగా జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్ కరోనా చేతికి చిక్కారు. వీరితోపాటు టాలీవుడ్లో మంచు మనోజ్, నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ మహామ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సోమవారం కొవిడ్ బారిన పడింది. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఆమె ప్రకటించింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను కొవిడ్‌కు గురయ్యాను. నేను క్షేమంగా ఉన్నాను. నన్ను సంప్రదించిన వారందరూ దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అని ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది ఈ 46 ఏళ్ల ఏక్తా కపూర్. View this post on Instagram A post shared by Erk❤️rek (@ektarkapoor) ఇదీ చదవండి: జెర్సీ హీరోయిన్‌కు కరోనా.. సురక్షితంగా ఉండండని పోస్ట్ -
స్వీయ నిర్బంధంలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
-
స్వీయ నిర్బంధంలోకి ఢిల్లీ సీఎం: ఎందుకంటే?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెండో దశలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజుకు 25వేలకు పైగా కేసులతో నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఏప్రిల్ 26 వరకు ఢిల్లీలో లాక్డౌన్ విధించింది అక్కడి ఆప్ సర్కార్. అయితే ఢిల్లీలో కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షిస్తూ, ప్రజలకు భరోసా ఇస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా స్వీయం నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఎందుకంటే కేజ్రీవాల్ సతీమణి సునీత తాజాగా కోవిడ్-19బారిన పడ్డారు. దీంతో ఢిల్లీ సీఎం హోం క్వారంటైన్లోకి వెళ్లారు. (కరోనా విలయం: ఢిల్లీలో లాక్డౌన్) కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో వారం రోజులు లాక్డౌన్ కొనసాగుతోంది. ఢిల్లీ ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసమే లాక్డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఢిల్లీసీఎ ప్రకటించారు. గత ఏడాది జూన్‌లో జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో కేజ్రీవాల్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో బయటపడుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్య కోలుకుంటున్న వారి కంటే తగ్గుతూ వస్తోంది. మరోవైపు దేశంలో పదేళ్లు దాటిన వారిలో ఆగస్టు నాటికి ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు అంచనా వేస్తున్నామని ఐసీఎంఆర్ చేసిన సెకండ్ సీరో సర్వే తెలిపింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు మంగళవారం విడుదలయ్యాయి. నగర మురికి వాడల్లో 15.6 శాతం కరోనా సోకగా, మురికివాడలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో 8.3 శాతం సోకినట్లు సర్వేలో తేలిందన్నారు. ఈ సర్వేను 21 రాష్ట్రాలకు చెందిన 700 గ్రామాల్లో జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. భారత్ లో ప్రతి మిలియన్ మందిలో 4,453 మందికి కరోనా సోకగా, 70 మరణాలు సంభవించాయని, ప్రపంచంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పారు. ఇదెలా ఉండగా, దేశంలో మంగళవారం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్త కేసులకంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 70,589 కేసులు నమోదు కాగా, 84,877 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 61,45,291 కి చేరుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 51,01,397 కు చేరుకుంది. గత రెండు వారాల్లోనే 11 లక్షలకు పైగా రికవరీలు అయినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 776మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 96,318కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,47,576 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 15.42 శాతం ఉన్నాయి. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 5.38 రెట్లు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమక్రమంగా 83.01 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. జగన్నాథుని ఆలయంలో 404 మందికి .. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న 351 మంది అర్చకులకు, 53 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఆలయ అధికారులు తెలిపారు. దేవాలయంలోని అర్చనలు ఒకదాని తర్వాత ఒకటి జరగాల్సి ఉంటుందని, ఏ ఒక్కటి జరగకపోయినా తర్వాత జరగాల్సినవి ఆగిపోతాయని చెప్పారు. ఈ క్రమంలో అర్చకులు ఒకరి తర్వాత ఒకరు ఉదయం నుంచి రాత్రి వరకు పని చేయడంతో కరోనా ఎక్కువగా ప్రబలినట్లు చెప్పారు. ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఉదయం సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అయితే ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉంటున్నట్టు తెలిపింది. ఉపరాష్ట్రపతి సతీమణి ఉషా నాయుడికి మాత్రం కోవిడ్ నెగెటివ్‌గా తేలింది. ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. -
మంత్రి ఈటల పేషీలో ఏడుగురికి కరోనా
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ మం త్రి ఈటల రాజేందర్ పేషీలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఇద్దరు డ్రైవ ర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్మెన్లు ఉన్నట్లు మంత్రి ఈటల రాజేందర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో తనకూ గురువారమే కరోనా నిర్ధారణ పరీక్ష చేశారని, ఆ పరీ క్షలో నెగెటివ్ వచ్చిందన్నారు. రెండ్రోజుల త ర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటానని ఆయన తెలిపారు. ఏడుగురికి కరోనా పా జిటివ్ రావడంతో మంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. దీంతో బీఆర్కే భవన్‌లోని మంత్రి ఈటల కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అయితే తనకు నెగెటివ్ వచ్చి నందున శనివారం బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయానికి యథావిధిగా వస్తానని ఈటల తెలిపారు. -
దీపక్ పూనియాకు కరోనా
న్యూఢిల్లీ: క్రికెట్, హాకీ తర్వాత ఇప్పుడు కరోనా సెగ భారత రెజ్లింగ్‌నూ తాకింది. స్టార్ రెజ్లర్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత దీపక్ పూనియా కోవిడ్–19 బారిన పడినట్లు ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ‘సాయ్’ గురువారం ప్రకటించింది. అతడితో పాటు నవిన్ (65 కేజీల విభాగం), కృషన్ కుమార్ (125 కేజీల విభాగం)లకు కూడా కరోనా సోకిందని తెలిసింది. హరియాణాలోని సోనేపట్ వేదికగా ఈ నెలలో పురుషుల జాతీయ శిక్షణ శిబిరం మొదలవ్వాల్సి ఉండగా... దీనికి ఎంపికైన రెజ్లర్లు సెప్టెంబర్ 1న అక్కడి ‘సాయ్’ సెంటర్లో రిపోర్ట్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం వారికి ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా... దీపక్, నవీన్, కృషన్‌లు కరోనా పాజిటివ్‌గా తేలారు. ‘ముగ్గురు సీనియర్ రెజ్లర్లకు కరోనా ఉన్నట్లు తేలింది. వెంటనే వారిని ‘సాయ్’ హాస్పిటల్లో చేర్పించాము. రెండు రోజుల తర్వాత వీరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. నెగెటివ్ అని వస్తే వారిని తిరిగి క్యాంపుకు తీసుకొస్తామం’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పేర్కొన్నారు. రెజ్లర్లకు కరోనా ఉన్నట్లు తేలినంత మాత్రాన క్యాంపు రద్దయ్యే అవకాశం లేదని అతడు స్పష్టం చేశారు. రెజ్లర్ల 14 రోజుల క్వారంటైన్ ముగిసిన వెంటనే శిక్షణ శిబిరం ఆరంభం అవుతుందని తోమర్ తెలిపారు. దీపక్ ఇప్పటికే 86 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్తును సొంతం చేసుకున్నాడు. -
హమ్మయ్య... మా వాళ్లకు నెగెటివ్
న్యూఢిల్లీ: యూఏఈ వెళ్లగానే కరోనా మహమ్మరి ఉచ్చులో విలవిలలాడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఊరటనిచ్చే ఫలితాలొచ్చాయి. కరోనా బారిన పడిన క్రికెటర్లు దీపక్ చహర్, రుతురాజ్ గైక్వాడ్ సహా 13 మందికి తాజా కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చెన్నై సీఈఓ కా శీ విశ్వనాథన్ మంగళవారం వెల్లడించారు. ‘ఔను... వాళ్లందరికీ ఇప్పుడు నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం వరుసగా రెండోసారీ చేసే పరీక్షలో కూడా నెగెటివ్ నిర్ధారణ కావాల్సి వుంటుంది. రెండో దఫా కోవిడ్ పరీక్షల్ని గురువారం చేస్తారు. అందులోనూ బయటపడితే 4వ తేదీ నుంచి నెట్ ప్రాక్టీస్ చేస్తారు’ అని ఆయన చెప్పారు. 20 వేలకుపైగా టెస్టులు... రూ. 10 కోట్ల ఖర్చు! సుమారు రెండు నెలల పాటు యూఏఈలో జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం 20 వేల పైచిలుకు పరీక్షల కోసం బీసీసీఐ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. అక్కడికి బయల్దేరడానికి ముందు చేయించిన పరీక్షలకైతే ఆయా ఫ్రాంచైజీలే భరించాయి. కానీ యూఏఈ చేరాక ఈ బాధ్యత బీసీసీఐది. దీంతో గత నెల 20 నుంచి టెస్టుల కోసం ఆర్టీ–పీసీఆర్ కిట్లు వినియోగిస్తోంది. దీనిపై బోర్డుకు చెందిన ఐపీఎల్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘టెస్టుల కోసం యూఏఈకి చెందిన వీపీఎస్ హెల్త్‌కేర్‌తో ఒప్పందం చేసుకున్నాం. 20 వేలకు పైగా టెస్టులు చేయాల్సిరావచ్చు. ఒక్కో టెస్టు కోసం 200 దిర్హమ్ (రూ.3978) ఖర్చు పెడుతున్నాం’ అని అన్నారు. -
సాత్విక్ ‘పాజిటివ్’
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో ఈనెలారంభంలో జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం మొదలైన వెంటనే కరోనా కలకలం చెలరేగింది. ఈ శిబిరానికి హాజరైన మహిళల డబుల్స్ స్టార్ సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కిరణ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. వెంటనే మరోసారి నిర్వహించిన కోవిడ్–19 టెస్టుల్లో వీరిద్దరికి నెగెటివ్ ఫలితం వచ్చింది. తాజాగా పురుషుల డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)కు కూడా కరోనా సోకింది. అతనిలో కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవు. ఈ మహమ్మారి సోకడంతో ప్రస్తుతం అమలాపురంలోని తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న సాత్విక్... ఈనెల 29న ఆన్లైన్లో జరిగే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవానికి దూరం కానున్నాడు. డబుల్స్‌లో తన భాగస్వామి చిరాగ్ శెట్టితో పాటు ఈ ఏడాది ‘అర్జున’ అవార్డుకు సాత్విక్ ఎంపికయ్యాడు. ‘కొన్నిరోజుల క్రితమే యాంటిజెన్ పరీక్షకు హాజరయ్యా. ఆ తర్వాత చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలోనూ కరోనా సోకినట్లు తేలింది. ఐదు రోజులుగా క్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నా. జ్వరం, జలుబు, ఒళ్లునొప్పుల్లాంటి లక్షణాలేవీ లేవు. మరో మూడు రోజుల తర్వాత మళ్లీ కరోనా టెస్టు చేయించుకుంటా. అదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులెవరికీ కరోనా పాజిటివ్ రాలేదు’ అని 20 ఏళ్ల సాత్విక్ వివరించాడు. సాత్విక్‌తో పాటు మరో ఇద్దరు అవార్డు విజేతలు కూడా కరోనా కారణంగా ఈ వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులు పేర్కొన్నారు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. మొదటిసారిగా... మరోవైపు కోవిడ్–19 నేపథ్యంలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం నిర్ణీత సమయానికి జరుగుతుందో లేదో అనే సందేహాల్ని పటాపంచలు చేస్తూ కేంద్రం వినూత్న సంప్రదాయానికి తెరతీసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వర్చువల్ (ఆన్లైన్) వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ‘సాయ్’ కేంద్రాలు ఇందుకు వేదికలుగా మారనున్నాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ నుంచే వర్చువల్ పద్ధతిలో విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. అవార్డులకు ఎంపికైన క్రీడాకారులంతా తమ నగరాల్లోని ‘సాయ్’ కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది 74 మంది జాతీయ అవార్డులకు ఎంపికవగా 65 మంది శనివారం ఈ అవార్డును పొందనున్నట్లు ‘సాయ్’ తెలిపింది. -
సిక్కి రెడ్డికి ‘నెగెటివ్’
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డికి, బ్యాడ్మింటన్ బృందం ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్‌కు ఊరట లభించింది. ఈనెల 7న గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జాతీయ శిక్షణ శిబిరం ప్రారంభమైన సందర్భంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిబంధనల ప్రకారం శిబిరంతో సంబంధమున్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా పాజిటివ్ రాగా... ఇతరులకు నెగెటివ్ వచ్చింది. అయితే పాజిటివ్ వచ్చిన సిక్కి రెడ్డి, కిరణ్‌లో కరోనా లక్షణాలు లేకపోవడంతో శుక్రవారం మళ్లీ స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో శిబిరంతో సంబంధమున్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈసారి సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా ‘నెగెటివ్’ ఫలితం వచ్చింది. -
కరోనా బారిన షట్లర్ సిక్కి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఐదు నెలల విరామం తర్వాత... ఈనెల 7న మొదలైన జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరానికి కరోనా వైరస్ కారణంగా ఆదిలోనే అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కచ్చితమైన నిబంధనల ప్రకారం శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి కలిపి మొత్తం 20 మందికి మంగళవారం కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, ఆమె తండ్రి పీవీ రమణ, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ సహా 18 మందికి నెగెటివ్ ఫలితం రాగా... సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కిరణ్‌లకు కరోనా పాజిటివ్ తేలిందని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వీరిద్దరికీ ఎలాంటి లక్షణాలు లేవని ‘బాయ్’ వివరించింది. శానిటైజ్ చేసేందుకు అకాడమీని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం కరోనా పరీక్షలకు హాజరైన వారందరూ శుక్రవారం స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో మరోసారి కోవిడ్ టెస్టులు చేయించుకుంటారని తెలిసింది. సిక్కి రెడ్డి, కిరణ్ ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారందరికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయనున్నారు. ‘భారత స్పోర్ట్స్ అథారిటీ నిబంధనల ప్రకారం జాతీయ శిక్షణ శిబిరంతో సంబంధం ఉన్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయ సిబ్బందికి, కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. కోచింగ్ క్యాంప్ మళ్లీ సజావుగా సాగేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరలో మళ్లీ శిబిరం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం’ అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. -
ధోనికి నెగెటివ్
రాంచీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చేసిన కోవిడ్–19 పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఐపీఎల్ తాజా నిబంధనల్లో భాగంగా అతనికి పరీక్ష చేశారు. ఇక్కడి గురునానక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు నగర శివార్లలో ఉన్న ధోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి అతని శాంపిల్స్ సేకరించారు. గురువారం రాత్రికి ఫలితాలు వచ్చాయి. ధోనితో పాటే చెన్నై జట్టులోని సభ్యుడైన మోనూ కుమార్ కూడా కరోనా పరీక్షకు హాజరయ్యాడు. ఫలితాల్లో నెగెటివ్‌గా రావడంతో ధోని నేడు చెన్నైకి వెళ్లి శిక్షణా శిబిరంలో పాల్గొంటాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్ వస్తేనే యూఏఈ విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు. కుటుంబ సభ్యులు లేకుండా... ఈ నెల 22న సూపర్ కింగ్స్ టీమ్ యూఏఈకి బయల్దేరనుంది. అయితే ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులెవరినీ తీసుకు వెళ్లరాదని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ‘ప్రస్తుతం టీమ్ సభ్యులు, సహాయక సిబ్బంది మినహా ఎవరూ రారు. లీగ్ సాగుతున్న కొద్దీ మున్ముందు ఏదైనా దశలో దీనిపై పునరాలోచిస్తాం. అవకాశాన్ని బట్టి అప్పుడు కుటుంబ సభ్యులను అనుమతించే విషయం పరిశీలిస్తాం’ అని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. నాయర్ కోలుకున్నాడు కర్ణాటక బ్యాట్స్‌మన్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరుణ్ నాయర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. గత నెలలో కోవిడ్–19 బారిన పడిన అతను 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందాడు. చికిత్స అనంతరం ఈ నెల 8న అతనికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా ‘నెగెటివ్’గా తేలాడు. దాంతో నాయర్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే ఈ ఫలితంతో అతను యూఏఈ వెళ్లేందుకు అవకాశం లేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోని ఇతర ఆటగాళ్లలాగే కరుణ్ కూడా మళ్లీ మూడు సార్లు కరోనా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందిన కరుణ్ నాయర్... మూడేళ్ల క్రితం చివరి సారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
త్రీడీ సాంకేతికతతో యూఏవీ
సాక్షి, హైదరాబాద్: పూర్తిగా త్రీడీ సాంకేతికతతో తయారైన విడిభాగాలతో రూపొందించిన మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ)ను ‘టీ–వర్క్స్’పరీక్షించింది. గురువారం హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. యూఏవీ విడి భాగాలను పాలీ లాక్టిక్ యాసిడ్ (పీఎల్ఎ), అక్రిలోనైట్రిల్ బ్యూటాడిన్ స్టిరీన్, హై ఇంపాక్ట్ పాలిస్టైరీన్ (హెచ్‌ఐపీఎస్) పదార్థాలతో తయారుచేశారు. ఒకటిన్నర కిలోల బరువున్న ఈ యూఏవీని గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనించేలా రూపొందించారు. గురువారం జరిగిన ప్రయోగ ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో త్రీడీ ముద్రిత యూఏవీల ఏరో డైనమిక్ ధర్మాలను విశ్లేషించనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్, మెకానికల్ రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్‌గా పేరొందిన టీ వర్క్స్.. ఎయిరోస్పేస్ రంగంలో త్రీడీ ప్రింటింగ్ అప్లికేషన్ల సామర్థ్యం, పనితీరుపై వరుస పరిశోధనలు చేస్తోంది. ‘గతంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలను కలప, ప్లేవుడ్‌తో తయారు చేసేందుకు గతంలో నాలుగైదు వందల గంటలు పట్టేది. కానీ కంప్యూటర్లో విడి భాగాల డిజైనింగ్, త్రీడీ ప్రింటర్ల ద్వారా ప్రోటోటైప్‌ల తయారీ సులభతరమైంది’అని టీ–వర్క్స్ సుజయ్ కారంపూరి వివరించారు. తక్కువ ఖర్చుతో తయారీ.. లిథియం పాలీమర్ బ్యాటరీ వినియోగంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సంక్లిష్టతతో తయారు చేసినట్లు సుజయ్ వెల్లడించారు. గురువారం పరీక్షించిన యూఏవీ డిజైన్, త్రీడీ విడి భాగాల ముద్రణకు 100 గంటల సమయం మాత్రమే పట్టిందని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టీ–వర్క్స్ భవనం మరో 5 నెలల్లో పూర్తవుతుందని, అయితే ఈ ఏడాది డిసెంబర్లో మొట్టమొదటి అత్యాధునిక ఏరోమోడలింగ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. సొంతంగా యూఏవీల డిజైన్, నిర్మాణంపై ఆసక్తి ఉన్నవారు టీ–వర్క్స్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. -
ప్రజల వద్దకే మలేరియా డిటెక్షన్ యూనిట్!
మలేరియాను నిర్మూలించడంలో మంగళూరు అధికారులు మరో అడుగు ముందుకేశారు. కర్నాటక ప్రాంతంలో గుర్తించిన మొత్తం 7800 మలేరియా కేసుల్లో మంగుళూరులోనే 4000 వరకూ ఉండటంతో అప్రమత్తమయ్యారు. ప్రజా వైద్య సౌకర్యాలను మెరుగు పరిచే దిశగా మొబైల్ మలేరియా డిటెక్షన్ యూనిట్ ను ప్రారంభించారు. కర్నాటక మంగుళూరు నగరంలో మలేరియా నివారణ, నియంత్రణ దిశగా చర్యలు ప్రారంభించారు. కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మొదటిసారి మొబైల్ మలేరియా గుర్తింపు యూనిట్ ను ప్రారంభించింది. ఆరుగురు నిపుణుల బృదంతోపాటు, విశ్లేషణా పరికరాలు, మందులతో కూడిన వాహనాన్ని అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్న మంగళూరు నగరంలో మార్చి 19న ప్రారంభించింది. ఇందులో భాగంగా వైద్య కార్మికులు ఉచిత పరీక్ష, చికిత్స అందించడంతో పాటు... విశ్లేషణా కిట్ సహాయంతో నిమిషాల్లో ఫలితాలను అందిస్తారు. ముందుగా రక్త నమూనాలను సేకరించి కిట్ ద్వారా పరిశీలిస్తారు. ఫలితం ప్రతికూలంగా చూపితే.. రక్త నమూనాలను మరింత విశ్లేషణ జరిపేందుకు మలేరియా టెస్టింగ్ సెంటర్ కు పంపిస్తారు. ఫలితాలు సానుకూలంగా చూపితే రోగులకు వెంటనే మందులను అందిస్తారు. రక్త పరీక్షలతోపాటు, మందులుకూడ ఉచితంగానే ఇస్తారు. ప్రజలు ఒక్క ఫోన్ కాల్ చేసి, అడ్రస్ ఇస్తే చాలు అరగంటలోపు మొబైల్ యూనిట్ వారింటిముందుండేట్టుగా ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. ఈ సౌకర్యం వినియోగించుకొనేందుకు ఓ హాట్ లైన్ నెంబర్ (9448556872) ను ప్రవేశ పెట్టారు. మలేరియా పరీక్షలు నిర్వహించిన ప్రతి వ్యక్తి వివరాలను ఈ మొబైల్ యూనిట్ రిజిస్టర్ చేస్తుంది. మలేరియా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ఆ వివరాలను మంగళూరు సిటీ కార్పొరేషన్ కు అప్పగిస్తుంది. గతేడాది అక్టోబర్ లో స్థాపించిన మలేరియా కంట్రోల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్ ద్వారా ఆ వివరాలను అప్ లోడ్ చేస్తారు. నగరంలోని మలేరియా కేసుల వివరాలను తెలిపేందుకు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ మ్యాపింగ్ టూల్ గా ఉపయోగపడుతుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి చికిత్సా కేంద్రానికి అనుబంధంగా ఈ మొబైల్ యూనిట్.. సేవలు అందిస్తుందని జిల్లా డిసీజ్ కంట్రోల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఎస్ బి. తెలిపారు. -
అక్కడ పెళ్ళికి ముందే హెచ్ఐవీ పరీక్షలు!
ఆ గ్రామస్థులు... గ్రామ పెద్దల నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నారు. హర్యానా భివానీ జిల్లాలోని చందేని గ్రామంలో పంచాయితీ సభ్యులు చేసిన ప్రత్యేక తీర్మానానికి ప్రజలంతా ఆమోదం తెలిపారు. వివాహానికి ముందే వధూవరులు హెచ్ఐవీ పరీక్షలను చేయించుకోవాలన్న ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు. సర్పంచ్ మమతా సంగ్వాన్ తో సహా పదిమంది పంచాయితీ సభ్యులను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారంతా ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపడంతోపాటు... స్థానిక ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఇందులో భాగంగానే వివాహానికి ముందు వధూవరులు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామ పెద్దల ఆలోచనతో ఏకీభవించిన ధరమ్ జిత్ గ్రేవాల్, ముఖేష్ రాణిలు తమ హెచ్ఐవీ రిపోర్టులను సర్పంచ్ కు అందజేశారు. గ్రామస్తుల్లో ఎక్కువశాతం విద్యావంతులేనని, వారందరికీ వ్యాధివల్ల వచ్చే సమస్యలు, ఇబ్బందులు తెలుసునని అందుకే పంచాయితీ తీర్మానాన్ని ఆమోదించి తాము పరీక్షలు చేయించుకున్నామని ధరమ్ జిత్ గ్రేవాల్ అన్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకొని పంచాయితీ పెద్దలను రిసెప్షన్ కు ఆహ్వానించి అందరి సమక్షంలో వారికి రిపోర్టులు సమర్పించామని తెలిపారు. తనకు ఈ ఆలోచనను గ్రామ కార్యకర్త, రంగస్థల నటుడు అయిన సంజయ్ రాంఫాల్ సూచించారని, అయితే తమ ఆలోచన తప్పనిసరిగా అమలవుతుందన్న నమ్మకం గట్టిగా ఉందని సర్పంచ్ మమత చెప్తున్నారు. అంతేకాక వివాహం చేసుకున్న నూతన దంపతులకు ఓ తులసి మొక్కను బహూకరించి, వారితో ప్రతిజ్ఞ కూడ చేయించేందుకు పంచాయితీ సభ్యులు నిర్ణయించారు. హెచ్ఐవీ ఎన్నో జీవితాలను బలి చేస్తోందని, ఆ వ్యాధితో తమ గ్రామంలో ఎవరూ మరణించకూడదన్నదే తమ లక్ష్యమని పంచాయితీ సభ్యులు అంటున్నారు. తమ గ్రామంలోనే కాక పరిసర గ్రామాల ప్రజలకు కూడ హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు ప్రయత్సిస్తున్నామని వారు చెప్తున్నారు. మొదటి మహిళా గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మమత పట్టభద్రు రాలు. ఆమె భర్త హితేష్ ఆర్మీలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే గ్రామస్థుల ఆరోగ్యమే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయం... వధూవరులకు అంగీకారమైతేనే పాటించవచ్చని, టెస్టులు చేయించుకోడానికి ఎటువంటి బలవంతం లేదని ఆమె చెప్తున్నారు.