‘నాగినిలకు నాగ పంచమి శుభాకాంక్షలు’ | On Nag Panchami Ekta Kapoor Wishes All Her Naagins With New Promo Post | Sakshi
Sakshi News home page

’నాగిని’ సీజన్‌-5 ప్రోమో పోస్టర్‌ విడుదల

Published Sat, Jul 25 2020 8:28 PM | Last Updated on Sat, Jul 25 2020 8:41 PM

On Nag Panchami Ekta Kapoor Wishes All Her Naagins With New Promo Post - Sakshi

న్యూఢిల్లీ: ఇవాళ నాగ పంచమి సందర్భంగా బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్ తన 'నాగిని'లకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక రాబోయే ‘నాగిని’ సీజన్‌-5 ప్రోమోను ఈ సందర్భంగా ఏక్తా ఆవిష్కరించారు. కానీ ఈ సిజన్‌లో కనిపించే కొత్త నాగిని ఎవరనేది మాత్రం తెలియకుండా కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసి అభిమానులను అయోమయంలో పెట్టారు. ఏక్తా ఈ పోస్టులో ‘నా నాగినీలకు.. హ్యాపీ నాగ పంచమి’ అంటూ గత సీజన్‌ల్లోని నాగినిలు మోనీ రాయ్‌, అనిత, కరిష్మా, సురభీ జ్యోతీ, నియా శర్మ తదితరులను ట్యాగ్‌ చేశారు. (చదవండి: నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం)

అయితే ఈ సీజన్‌లో హినా ఖాన్‌ నటించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ తను లీడ్‌రోల్‌లో నటిస్తుందా లేదా సపోర్టింగ్‌ క్యారెక్టర్‌లో నటించనుందా అనే దానిపై స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ ‘నాగినీ-5’లో నటించే ప్రధాన పాత్రల పేర్లను నిర్మాత గోప్యంగా ఉంచారు. 'కుండలి భాగ్య' ఫేమ్ ధీరజ్ ధూపర్ మేల్‌ లీడ్‌రోల్‌లో ఈ సీజన్‌లో కనిపించనున్నాడు. తన కొత్త సీరియల్‌పై ధీరజ్‌ అనందం వ్య​క్తం చేస్తూ... ‘‘ఇది నాకు చాలా ఉత్తేజకరమైన సమయం. టెలివిజన్‌లో అగ్రశ్రేణి షో అయిన ‘నాగినీ’ వంటి కార్యక్రమంలో నటించాలన్నది ప్రతి నటుడి కల. ఇది నాకు సరికొత్త అనుభవంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకు ముందెన్నడు ఇలాంటి పాత్రలు చేయలేదు. ఏక్తా కపూర్‌తో కలిసి పనిచేయడం, కలర్స్‌తో మళ్లీ సంబంధం కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement