లిఫ్ట్ ఇచ్చి... ఉంగరాలు లాక్కొన్నాడు | Rings steals after giving lift | Sakshi
Sakshi News home page

లిఫ్ట్ ఇచ్చి... ఉంగరాలు లాక్కొన్నాడు

Published Sat, Sep 19 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

Rings steals after giving lift

చైతన్యపురి: బైక్‌పై లిఫ్టు ఇచ్చిన గుర్తుతెలియని దుండగుడు ఉంగరాలు లాక్కొని పరారయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాదితులు తెలిపిన వివరాల ప్రకారం బాలాపూర్‌కు చెందిన రవిమోహన్ (58) శుక్రవారం రాత్రి కొత్తపేట కమర్షియల్ ట్యాక్స్ కాలనీలోని తోడల్లుడు ఇంటి వెళుతున్నాడు.

ఆటో కోసం కొత్తపేట చౌరస్తాలో నిలబడి ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తా రమ్మని రవిమోహన్‌ను వాహనంపై ఎక్కించుకున్నాడు. నాగోల్ వెళ్లేదరిలో బైక్ ఆపి తన పర్సు పోయిందని అన్నాడు. దీంతో ర విమోహన్‌తో వాదనకు దిగి బలవంతంగా చేతికి ఉన్న పన్నెండు గ్రాముల రెండు బంగారు ఉంగరాలను లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. బాదితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement