వలయాలకు సెలవిక! | beauty tips | Sakshi
Sakshi News home page

వలయాలకు సెలవిక!

Published Mon, Aug 15 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

వలయాలకు సెలవిక!

వలయాలకు సెలవిక!

 బ్యూటిప్స్

తాజా టొమాటోను మెత్తని పేస్ట్‌లా చేసి... అందులో కాస్త నిమ్మరసం, చిటికెడు పసుపు, చెంచాడు శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని కళ్ల కింది నల్లటి వలయాల మీద రాస్తే మంచి ఫలితముంటుంది.పుదీనా ఆకుల్ని మెత్తగా నూరి, కాసింత పాల క్రీమ్ చేర్చి కళ్లకింద బాగా రుద్దాలి. వారానికి రెండుమూడు సార్లు ఇలా చేస్తే... డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి. పైనాపిల్ జ్యూస్‌లో కొద్దిగా పసుపు వేసి కలపాలి. దీన్ని పడుకునేముందు కళ్ల కింది వలయాలపై పూసి, ఉదయం లేచిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేస్తే వారం పది రోజుల్లో వలయాలు మాయమైపోతాయి.

బాదంపప్పుల్ని నానబెట్టి, తోలు తీసి, మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీనిలో కాసింత క్రీమ్, కొద్దిగా పసుపు వేసి కలిపి వారినికోసారైనా రాస్తూ ఉంటే... డార్క్ సర్కిల్స్ ఏర్పడవు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement