ప్రతీకాత్మక చిత్రం
ముఖం మెరిసిపోవాలి అంటే తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేయాలి. వీటిలో తగినన్ని నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే వారంలో చక్కటి ఫలితం కనిపిస్తుంది.
►కొన్ని కొన్ని కాంబినేషన్లను మనం అసలు ఊహించలేం. అలాంటి వాటిలో టమాటా... సీ సాల్ట్ ఒకటి.
►ఈ రెంటినీ కలిపి సౌందర్య సాధనంగా ఉపయోగించడమే గమ్మత్తు. ఒక టమాటా తీసుకుని దానిని కట్ చేసి.. దాని నుంచి రసం వేరుచేసుకుని ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సున్నితంగా ముఖంపై అప్లై చేయాలి.. ఇది ముఖంపై సహజ బ్లీచింగ్ లా పనిచేస్తుంది. మృతకణాల్ని తొలగిస్తుంది. ముఖం మెరుపును సంతరించుకుంటుంది. అంతేకాదు, చర్మం ఉబ్బరించడాన్ని కూడా ఉప్పు నివారిస్తుంది.
ఇక బాదం పప్పును నానబెట్టి ఒలిచి హల్వాల్లో వేసుకుంటాం. ఆ పొట్టును పారేస్తుంటాం. అలా కాకుండా ఆ పొట్టును ఒంటికి రుద్దుకుంటే శరీరం మెరుపు సంతరించుకుంటుంది.
బంగాళదుంపతో ఇలా..
►బంగాళదుంప తురుముని ఐస్ వాటర్‌లో అయిదు నిమిషాల పాటుంచి తీయాలి. దీంట్లో తేనె కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గుతాయి.
►రెండు టీ స్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ మొదలుకొని ముఖానికి పట్టించి ఆరిన తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మ కాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది.
చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
Comments
Please login to add a commentAdd a comment