భార్యను రైలు ఢీకొన్నదని.. భర్త కూడా రైలుకెదురెళ్లి.. | Husband Dies By Suicide After Wife Died Being Hit By A Train In Rajasthan, More Details Inside | Sakshi
Sakshi News home page

భార్యను రైలు ఢీకొన్నదని.. భర్త కూడా రైలుకెదురెళ్లి..

Published Sat, Jul 20 2024 12:00 PM | Last Updated on Sat, Jul 20 2024 1:14 PM

Wife Died After Being hit by a Train Husband Also

భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఒకవేళ భాగస్వామిలో ఒకరు దూరమైతే మరొకరు తల్లడిల్లిపోతుంటారు. ఊహకందని నిర్ణయాలు కూడా తీసేసుకుంటారు. ఇంటిలోనివారికి, బంధువులకు విషాదాన్ని మిగులుస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఉదంతం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో రాజల్‌దేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఒక మహిళ రైలు ఢీకొని మృతి చెందింది. ఈ విషయం తెలియగానే భర్త అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అతను కూడా రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. బాబులాల్‌ రేగర్‌ (50)కు తన భార్య సంతోష్‌ రేగర్‌ (43)తో ఏదో విషయమై మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారిద్దరూ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు.

రెండు రోజుల క్రితం సంతోష్‌ రేగర్‌ తన ఇంటికి సమీపంలోని రాజల్‌దేసర్‌లోని రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని మృతి చెందింది. ఈ విషయం తెలియగానే భర్త బికనీర్-ఢిల్లీ ప్యాసింజర్ రైలుకు ఎదురెళ్లాడు. ఆ రైలు అతనిని ఢీకొనడంతో మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం  భార్యాభర్తల మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement