కారు ఢీకొని బాలుడి మృతి
Published Mon, Sep 19 2016 1:03 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
శివకోడు (రాజోలు) : శివకోడులో 216 జాతీయ రహదారిపై వేగం గా వెళ్తున్న ఒక గుర్తు తెలియని కారు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పాసం వినయ్‌సుభాష్(10)ని ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నిలపకుండా డ్రైవర్ వేగంగా వెళ్లిపోవడాన్ని స్థానికులు గుర్తించారు. అక్కడే కారుకు చెందిన నెంబర్ ప్లేటు ఇరిగిపడిపోగా దానిలో మూడు అంకెలు ఉన్న బోర్డును స్థానికులు పోలీసులకు అప్పగించారు. వివరాల ప్రకారం స్థానిక పంచాయతీకి వెళ్లే సమీపంలో మన్నే సత్యనారాయణ ప్రథమ వర్థంతి కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా కొత్తూరుకు చెందిన పాసం నాగరాజు, వెంకటలక్ష్మి దంపతులతోపాటు వారి కుమారుడు వినయ్ సుభాష్ కూడా వచ్చాడు. భోజనాలు ముగించుకుని ఇంటికి వెళ్లిపోతున్న సమయంలో రోడ్డుకు అవతలివైపు ఉన్న వినయ్‌సుభాష్ రోడ్డు దాటేం దుకు ప్రయత్నిస్తుండగా రాజోలు నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న షిప్టుకారు వేగంగా వచ్చి బాలుడిని ఢీ కొట్టింది. కళ్ల ముందు కన్నకొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.
Advertisement