కశ్మీర్‌లో విలన్లను రఫ్ఫాడిస్తున్నారు నాని. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు.
‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు నాని. ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు టాకీ పార్ట్‌ని చిత్రీకరిస్తున్నాం. 2025 మే 1న సినిమాని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్.
Comments
Please login to add a commentAdd a comment