క్రికెట్ ఆడుతుండగా బాల్ తగిలి బాలుడి మృతి | 6yrs old boy died after hit by ball | Sakshi
Sakshi News home page

క్రికెట్ ఆడుతుండగా బాల్ తగిలి బాలుడి మృతి

Published Fri, Apr 24 2015 10:31 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

6yrs old boy died after hit by ball

హైదరాబాద్: క్రికెట్ మరొకరి ప్రాణం బలిగొంది.  క్రికెట్ ఆడుతుండగా బంతి తగిలి గాయపడి నాలుగున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన సహారా ఎస్టేట్స్‌లో క్రికెట్ ఆడుతూ వంశీకృష్ణ నిన్న స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాడు. 

ఆ సమయంలో వంశీకృష్ణకు బంతి బలంగా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. వంశీకృష్ణ నాగార్జున మాంటెస్సరీ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. అతడికి తమ్ముడు, చెల్లెలు ఉన్నారు.

 

వంశీకృష్ణ మృతితో వనస్థలిపురం సహారా ఎస్టేట్స్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వంశీకృష్ణ మృతదేహాన్నికి ఉస్మానియాలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement