
అయాన్షు(ఫైల్)
సాక్షి, కామారెడ్డి క్రైం: చూసుకోకుండా కారును వెనక్కి తీయడంతో 13 నెలల బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సిద్దం స్వామి, శ్వేతలకు 13 నెలల బారు అయాన్షు ఉన్నాడు. స్వామి తనకున్న స్విఫ్ట్ డిజైర్ కారును కిరాయికి నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి దగ్గరే పార్క్ చేసి ఉంచిన కారును కిరాయి నిమిత్తం స్వామి అన్న సాయిలు బయటకు తీయబోయాడు.
అకస్మాత్తుగా ఇంట్లో నుంచి కారు వద్దకు వచ్చిన అయాన్షు కారు వెనుక భాగంలో నిల్చున్నాడు. సాయిలు గమనించకుండా కారును వెనక్కి తీసుకోవడంతో బాలుని తలపై నుంచి టైరు వెళ్లింది. బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి.. అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
(చదవండి: పెంపుడు కుక్కతో తమాషా చేస్తూ..జనంపైకి ఉసిగొల్పిన ఓ సీఐ)
Comments
Please login to add a commentAdd a comment