24 నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
24 నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
Published Sat, Feb 18 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
ఉప్పలగుప్తం : మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24 నుంచి 28 వరకూ నిమ్మకాయల వెంకటరంగయ్య జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెంకటరంగయ్య వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రూపొందించిన వార్షిక క్యాలెండర్‌ను జగ్గయ్యనాయుడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించే ఈ పోటీలలో...
పురుష విభాగంలో ఆంధ్రా స్పైకర్స్ (ఏపీ టీం), వెస్ట్రన్‌రైల్వేస్–ముంబాయి, నార్త్ ఈస్ట్రన్‌రైల్వేస్– గోరఖ్‌పూర్, ఇన్‌కమ్ టాక్స్–చెన్నై, సాయి అకాడమి–గుజరాత్, ఐసీఎఫ్ క్లబ్–చెన్నై జట్లు, మహిళా విభాగంలో జెపీఆర్ యూనివర్సీటీ–చెన్నై, ఎస్‌సీ రైల్వేస్– సికింద్రాబాద్, సాయి అకాడమి–గుజరాత్, కేరళ జట్లు పాల్గొంటున్నాయి.అంతర్జాతీయ ప్రమాణాలతో వాలీబాల్ కోర్టు సిద్ధం చేశామని, క్రీడలను వీక్షించేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టోర్నీ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌వీఆర్ గొలవిల్లి.కామ్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. టోర్నీ కార్యదర్శి మద్దింశెట్టి సుబ్బరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి గొలకోటి ఫణీంద్ర కుమార్, కోశాధికారి అధ్యక్షులు అరిగెల వెంకటముసలయ్య, ఉపాధ్యక్షులు గొలకోటి సత్తిరాజు, ఉండ్రు సుబ్బారావు(రాజబాబు), గుర్రాల ప్రసాద్, సలాది సత్తిబాబు, ఉండ్రు ముసలయ్య, ఎంఎస్‌ఆర్ స్వామి, గుత్తాల సుభాష్ చంద్రబోస్, జన్నూరి వెంకటేశ్వరరావు, గనిశెట్టి తాతాజీ, సుందరనీడి సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement