competetioons
-
ఎయిర్టెల్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్టెల్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రకటించింది. ఇన్వెస్ట్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కమ్యూనికేషన్స్, డిజిటల్ అడ్వర్టైజింగ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో విభిన్న పరిష్కారాలను ప్రదర్శించడానికి తొలి దశ సాంకేతిక కంపెనీలను ఆహ్వానిస్తారు. విజేతలుగా నిలిచిన టాప్–10 కంపెనీలకు నగదు బహుమతులు, ఎయిర్టెల్ ఇన్నోవేషన్ ల్యాబ్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఔత్సాహిక స్టార్టప్స్ జనవరి 24లోగా దరఖాస్తు చేసుకోవాలి. -
క్రీడలు జీవితంలో భాగం కావాలి
-క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు -గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ ప్రారంభం అమలాపురం/ ఉప్పలగుప్తం : క్రీడలు జీవితంలో భాగం కావాలని, అప్పుడే మనిషి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉంటాడ రాష్ట్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ జాతీయ వాలీబాల్ ఇన్విటేషన్ మెన్, ఉమెన్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. క్రికెట్‌కే కాక ఇటీవల కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు ఆదరణ పెరుగుతోందన్నారు. విశాఖలో ఏటా బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పి.వి.సింధు సాధించిన విజయంతో ఒలింపిక్ క్రీడలకు ఆదరణ పెరిగిందన్నారు. రాష్ట్రంలో మైదానాల అభివృద్ధి, క్రీడా పరికరాల పంపిణీకి ఎమ్మెల్యే, మంత్రులు కోరిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. గొల్లవిల్లిలో రూ.కోటితో స్టేడియం గొల్లవిల్లిలో రూ.కోటితో స్టేడియం నిర్మిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని గ్రామీణ క్రీడలను నిర్వహిస్తామని, రాష్ట్రంలో తూర్పుగోదావరిని క్రీడల్లో అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు. కోనసీమస్థాయిలో ఆరంభమైన టోర్నమెంట్‌ను ఇప్పుడు జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నామంటే అందుకు గొల్లవిల్లి వాసులే కారణమన్నారు. స్టేడియంల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, అమలాపురం మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఎంపీపీ శిరంగు సత్తిరాజు, జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, టోర్నమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మద్దింశెట్టి సురేష్, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నారాయణరావు, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ వై.బంగార్రాజు, ఆర్‌ఐపీఈ టి.వి.ఎస్.రంగారావు, పాల్గొన్నారు. ఆకట్టుకున్న క్రీడాజ్యోతి ప్రజ్వలన పోటీల ప్రారంభం సందర్భంగా క్రీడాజ్యోతిని వెలిగించిన తీరు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఓ జ్యోతిని రిమోట్ కారులో ఉంచి మైదానమంతా తిప్పారు. ఆ జ్యోతిని క్రీడలమంత్రి అచ్చెన్నాయుడు వెలిగించి దానితోపాటు నడుచుకుంటూ ప్రధాన క్రీడాజ్యోతి వద్దకు వెళ్లి, వందలాది మంది క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య దాన్ని వెలిగించారు. క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు రాజప్ప, అచ్చెన్నాయుడు కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్ఐ) నిబంధనలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన కోర్టును చూసి క్రీడాకారులు సైతం మంత్రముగ్ధులయ్యారు. -
చేతులే ట్రిగర్లు..బంతులే బుల్లెట్లు
-నేటి నుంచి గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ -ఫ్లడ్ లైట్ల కాంతిలో అయిదురోజుల పాటు నిర్వహణ -అధునాతన ప్రమాణాలతో సిద్ధమైన కోర్టు అమలాపురం / ఉప్పలగుప్తం : ఆటగాళ్లే తుపాకులవుతారు. గురినెరిగిన వాళ్ల చేతులే ట్రిగ్గర్లవుతాయి. తిన్నగా, వాలుగా, మూలగా దూసుకుపోయే బంతులే బుల్లెట్లవుతాయి. అయిదురోజుల పాటు చూసేవారికి కనువిందు చేసే క్రీడా సమరానికి సాధారణ గ్రామమైన గొల్లవిల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణం వేదిక కానుంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ వాలీబాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న జాతీయస్థాయి, వాలీబాల్ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను ఫ్లడ్ లైట్ల కాంతిలో రేయింబవళ్లు ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు నిర్వాహక కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా అధునాతన కోర్టు, 15 వేల మంది వరకూ పోటీలు వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పురుషుల, మహిళల విభాగాల్లో జరిగే పోటీలకు తిలకించేందుకు మíßహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషుల, మహిళ జట్లు తలపడనున్నాయి. లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించి మెరుగైన పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య ఫైనల్ పోటీలను ఈనెల 28న నిర్వహిస్తారు. పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి క్రీడాభిమానులు తరలివస్తారు. రోజుకు 20 వేల నుంచి 30 వేలమంది తరలి రావచ్చని అంచనా. పోటీలు జరిగే ప్రాంగణంతో బయట కూడా క్రీడాభిమానులు పోటీలు వీక్షించేలా నిర్వాహక కమిటీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తోంది. క్రీడాభిమానులతో ఈ ఐదురోజులూ గొల్లవిల్లిలో రేయింబవళ్లు పండుగ వాతావరణం నెలకొననుంది. పది జట్లు.. పాటవం గల ఆటగాళ్లు పోటీల్లో పురుషులు, మహిళల విభాగంలో మొత్తం పది జట్లు తలపడనున్నాయి. పురుషుల విభాగంలో వెస్ట్రన్ రైల్వేస్ (ముంబాయి), ఆంధ్రా స్పైకర్స్ (ఏపీ) సాయి అకాడమీ (గుజరాత్), ఇన్కమ్ ట్యాక్స్ (చెన్నై), పోస్టల్ (కర్ణాటక), సీఆర్పీఎఫ్ (ఢిల్లీ) జట్లు, మహిళా విభాగంలో జేపీఆర్ యూనివర్సిటీ (చెన్నై), ఎస్సీ రైల్వేస్ (సికింద్రాబాద్), సాయి అకాడమీ(గుజరాత్), కర్నాటక స్టేట్ జట్లు తలపడనున్నాయి. ఇంటర్ నేషనల్స్‌లో 10 సార్లు పాల్గొన్న ప్రదీప్ చెన్నై ఇన్‌కంట్యాక్స్ నుంచి టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాల జాతీయ క్రీడాకారులు నరేష్, కృష్ణంరాజు, సుబ్బారావు, ప్రభు, కార్తీక్, ఇండియా మహిళా జట్టు క్రీడాకారిణి హేమ పోటీల్లో తమ ప్రతిభ చూపనున్నారు. 1988లో కోనసీమస్థాయితో శ్రీకారం.. గొల్లవిల్లిలో తొలిసారిగా ఉండ్రు సాంబశివరావు మెమోరియల్ పేరిట 1988లో కోనసీమస్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. రెండేళ్లు కోనసీమస్థాయిలో జరిగిన పోటీలు 1990లో జిల్లా స్థాయికి, 1994 నాటికి రాష్ట్రస్థాయికి చేరాయి. 2002 వరకూ రాష్ట్రస్థాయిలో జరిగాయి. తరువాత కొంత విరామం ఏర్పడ్డా 2013, 2014లలో దక్షిణభారతస్థాయిలో సలాది పల్లంరాజు మెమోరియల్ పోటీలు నిర్వహించారు. 2015 నుంచి నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ పేరిట జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగిన పోటీల్లో పాల్గొన్న ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణిస్తున్నారు.వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్ఐ) నిబంధనలకు అనుగుణంగా పోటీల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. క్రీడాకారులకు మెరుగైన వసతి, భోజనాలకు నిర్వాహక కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలతో మాకు స్ఫూర్తి గొల్లవిల్లిలో మూడు దశాబ్దాలుగా పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడి పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, ఎంతో మందిని చక్కటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాయంటే అతిశయోక్తి కాదు. జాతీయ క్రీడాకారుల ఆటతీరును అవగతం చేసుకుని మెళకువలు తెలుసుకుంటాం. ఇదే కోర్టులో మేం రోజూ ప్రాక్టీసు చేస్తాం. -అరిగెల నరసింహారావు, యువ వాలీబాల్ క్రీడాకారుడు, గొల్లవిల్లి గ్రామానికి గర్వకారణం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలతో గ్రామం కీర్తి దేశం నలుమూలలకూ విస్తరించడం గర్వంగా ఉంది. శివరాత్రితో పాటు జరిగే క్రీడాపోటీలకు బంధువులు రావడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో ఇదో పెద్ద పండుగ. వాలీబాల్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పోటీపడటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. - చీకట్ల ఏసుబాబు, వ్యాపారి, గొల్లవిల్లి -

24 నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం : మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24 నుంచి 28 వరకూ నిమ్మకాయల వెంకటరంగయ్య జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెంకటరంగయ్య వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రూపొందించిన వార్షిక క్యాలెండర్‌ను జగ్గయ్యనాయుడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించే ఈ పోటీలలో... పురుష విభాగంలో ఆంధ్రా స్పైకర్స్ (ఏపీ టీం), వెస్ట్రన్రైల్వేస్–ముంబాయి, నార్త్ ఈస్ట్రన్రైల్వేస్– గోరఖ్‌పూర్, ఇన్కమ్ టాక్స్–చెన్నై, సాయి అకాడమి–గుజరాత్, ఐసీఎఫ్ క్లబ్–చెన్నై జట్లు, మహిళా విభాగంలో జెపీఆర్ యూనివర్సీటీ–చెన్నై, ఎస్సీ రైల్వేస్– సికింద్రాబాద్, సాయి అకాడమి–గుజరాత్, కేరళ జట్లు పాల్గొంటున్నాయి.అంతర్జాతీయ ప్రమాణాలతో వాలీబాల్ కోర్టు సిద్ధం చేశామని, క్రీడలను వీక్షించేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టోర్నీ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్వీఆర్ గొలవిల్లి.కామ్ వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. టోర్నీ కార్యదర్శి మద్దింశెట్టి సుబ్బరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి గొలకోటి ఫణీంద్ర కుమార్, కోశాధికారి అధ్యక్షులు అరిగెల వెంకటముసలయ్య, ఉపాధ్యక్షులు గొలకోటి సత్తిరాజు, ఉండ్రు సుబ్బారావు(రాజబాబు), గుర్రాల ప్రసాద్, సలాది సత్తిబాబు, ఉండ్రు ముసలయ్య, ఎంఎస్ఆర్ స్వామి, గుత్తాల సుభాష్ చంద్రబోస్, జన్నూరి వెంకటేశ్వరరావు, గనిశెట్టి తాతాజీ, సుందరనీడి సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.