
‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ప్లాన్ కాస్త మారింది. ఎందుకంటే హీరో రామ్‌చరణ్ జిమ్‌లో గాయపడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా విదేశీ నటి డైసీ ఎడ్గర్ జోన్స్, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ పూణెలో జరగాల్సి ఉంది. రామ్‌చరణ్ గాయపడటం వల్ల వాయిదా పడింది. ‘‘మంగళవారం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో రామ్‌చరణ్ (చీలమండ) గాయపడ్డారని తెలియజేయడానికి బాధపడుతున్నాం. ప్రస్తుతానికి ఫుణె షెడ్యూల్ లేదు. మూడు వారాల తర్వాత యాక్షన్ తిరిగి ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు.