
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కొత్త పని మొదలు పెట్టింది. ఫిట్‌నెస్ విషయంలో పక్కాగా ఉండే ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియా భట్‌తో కసరత్తులు చేయిస్తోంది. జిమ్ ట్రైనర్ రాని సమయంలో అలియా భట్ కు సూచనలిస్తున్న ఓ వీడియోను కత్రినా తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ఇద్దరు అందాలభామలు కసరత్తులు చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కత్రినా ప్రస్తుతం సల్మాన్ సరసన టైగర్ జిందాహై, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాల్లో నటిస్తుండగా అలియా భట్ ‘రాజీ’ షూటింగ్ లో బిజీగా ఉంది. సినిమాలతో పాటు ర్యాంప్ వాక్‌లతోనూ అలరించే ఈ ముద్దుగుమ్ములు ఫిట్ నెస్‌విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందుకే ట్రైనర్ రాకపోయినా తానే స్వయంగా ట్రైనర్ గా మారి అలియాతో కసరత్తులు చేయించింది కత్రినా.