జిమ్‌లో బుట్టబొమ్మ కసరత్తులు.. 'ప్రేరణ' పొందేలా | Pooja Hegde Beautiful Workout Video Goes Viral | Sakshi
Sakshi News home page

Pooja Hegde: జిమ్‌లో బుట్టబొమ్మ కసరత్తులు.. 'ప్రేరణ' పొందేలా

Published Fri, Jan 7 2022 7:54 PM | Last Updated on Tue, Jan 18 2022 3:58 PM

Pooja Hegde Beautiful Workout Video Goes Viral - Sakshi

సినిమా అనే రంగుల ప్రపంచంలో అందమైన హీరోయిన్లు ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లాంటి వాళ్లు. అందుకే తమ అందానికి, ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు అనేక కసరత్తులు చేస్తుంటారు. కథానాయికలకు చక్కటి రూపుతో పాటు ఆకర్షించే శరీరాకృతి కూడా ముఖ్యమే. ఇది తెలిసిన హీరోయిన్లు విజయంతో దూసుకెళ్తుంటే దీన్ని వంటపట్టిచ్చుకోని ముద్దుగుమ్మలు అవకాశాలు లేక కనుమరుగైపోతున్నారు. ఇక ఇదంతా పోతే ఫిట్‌నెస్‌కు అధిక ప్రాముఖ్యత ఇచ్చే హీరోయిన్లలో బుట్ట బొమ్మ పూజా హెగ్డె ఒకరు. ఆమె ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్‌ అని చెప్పడానికి ఆమె చక్కటి ఫిజిక్‌యే నిదర్శనం. 
(చదవండి: ఆ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్‌ చేశా: పూజా హెగ్డె)

తాజాగా పూజా హెగ్డె జిమ్‌లో చెమట చిందించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన ఎక్సర్‌సైజ్‌ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. నెమ్మదిగా, నియంత్రిత కదలికలు. తర్వాత ప్రయత్నించండి అని క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ భామ. ఈ వీడియోలో రెడ్‌ కలర్‌ మ్యాచింగ్‌ స్పోర్ట్స్‌ డ్రెస్‌తో వర్క్‌అవుట్ చేస్తుంటే తన ట్రైనర్‌ ఎలా చేయాలో నేర్పించడం చూడొచ్చు. తన వర్క్అవుట్‌ వీడియోలతో అందంతోపాటు ఫిట్‌నెస్ కూడా ముఖ్యమే అని తన అభిమానులకు, తదితర హీరోయిన్లకు 'ప్రేరణ' కలిగిస్తోంది ఈ 'రాధేశ్యామ్‌' బ్యూటీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement