స్నేహలోని కొత్త కోణం | Heroine Sneha Gym Workout | Sakshi
Sakshi News home page

స్నేహలోని కొత్త కోణం

Jun 14 2020 7:49 AM | Updated on Jun 14 2020 9:00 AM

Heroine Sneha Gym Workout - Sakshi

చిరునవ్వులకు చిరునామా నటి స్నేహ అనడం అతిశయోక్తి కాదు. తన నవ్వులతో దక్షణాది సినీ ప్రేక్షకులను వశపరచుకున్న నటి ఈ బ్యూటీ. కుటుంబ కథా చిత్రాల నటిగా పేరు తెచ్చుకోవడం స్నేహ ప్రత్యేకత. అలా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయకిగా రాణించింది. ఆ విధంగా నటిగా క్రేజ్‌ లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నటనకు కొంత గ్యాప్‌ ఇచ్చిన నటి స్నేహ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు కథానాయిక కాకుండా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చదవండి: వయసు 87 ఇమేజ్‌.. సినిమాస్టార్‌

కాగా నటి స్నేహ, ప్రసన్నలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీవ్ర కసరత్తులు చేస్తూ బాడీని ఫిట్‌ గా తయారు చేసుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి కసరత్తులు హీరోలు చేస్తుంటారు. అలాంటిది ఇద్దరు పిల్లల తల్లి అయిన నటి స్నేహ చేస్తుండడం విశేషం. దీంతో ఆమె నేటి యువ హీరోలకు సవాల్‌ విసురుతున్నరా లేక ఆమె సహా నటీమణులకు తన సత్తాను చాటుతున్నారాఅన్న ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం మీద నటి బాడీ బిల్డ్‌ దృశ్యాలు ఇప్పుడు సామాద్యక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  చదవండి: హ్యాపీ గార్డెనింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement