
వ్యాయామం ఎక్కడైనా చేయొచ్చు. ఇంట్లో లేక జిమ్‌లో. వీలున్న చోట చెమటోడుస్తుంటారు. ఇల్లు, జిమ్ కాకుండా రష్మికా మందన్నా వర్కౌట్ చేయడానికి కొత్త చోటుని వెతుక్కున్నారు. కొన్ని రోజులుగా బీచ్‌లో వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ కొత్త అలవాటు గురించి రష్మికా మందన్నా మాట్లాడుతూ –‘‘బీచ్‌లో వ్యాయామం చేయడం ఇదే తొలిసారి. ఇదో సరికొత్త అనుభూతి. కొన్ని రోజుల్లోనే బీచ్‌లో వర్కౌట్స్ చేయడం వ్యసనం అయిపోయింది. అలల చప్పుళ్లు, సముద్రపు గాలి, సువాసన, సూర్యాస్తమయం చూడటం, కాళ్ల కింద ఇసుక తగలడం... భలే చక్కటి అనుభూతి. ఇక నుంచి కొత్త ప్రదేశాల్లో ఎక్కడ వర్కౌట్ చేసినా ఓ వీడియో పంచుకోవాలనిపిస్తోంది’’ అన్నారు. బీచ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారామె.
Comments
Please login to add a commentAdd a comment