Samantha Deadlifts 75 to 80 Kg at New Gym Workout Video - Sakshi
Sakshi News home page

Samantha: సమంత లేటెస్ట్‌ వీడియో.. వావ్‌ అనిపించేలా

Published Sat, Jan 15 2022 3:07 PM | Last Updated on Sat, Jan 15 2022 5:18 PM

Samantha Deadlifts 75 to 80 Kg At Gym In New Workout Video - Sakshi

స్టార్ హీరోయిన్‌ సమంత వరుస సినిమా ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంది. కొంచెం ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో కలిసి టూర్లు ప్లాన్‌ చేస్తూ అస్సలు టైం వేస్ట్‌ చేయదు. సినిమాలు, టూర్లు కాకుండా తన ఫిట్‌నెస్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త కొత్త ఫిట్‌నెస్‌ వర్కవుట్స్‌ చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ సూపర్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్న తన వ్యాయామ దినచర్యను మాత్రం ఎప్పుడూ వాయిదా వేసుకోదు. అందుకే ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది సామ్‌. తాజాగా తాను చేసిన కొత్త వర్కవుట్‌ వీడియోను శుక్రవారం ఇన్‌స్టా స్టోరీ ద్వారా షేర్‌ చేసింది. 

ఇదీ చదవండి: అందుకే విడిపోయాం.. విడాకులపై చై ఆసక్తికర వ్యాఖ్యలు

సామ్‌ మొదటగా 75 కిలోల బరువును ఎత్తుతున్న వీడియోను  పోస్ట్‌ చేసింది. ఆ వీడియోపై 'హలో 75.. నేను నిన్ను మిస్‌ చేశాను' అని రాసుకొచ్చింది. దాని తర్వాత సమంత 78 కిలోలు, అనంతరం 80 కిలోల బరువులను ఎత్తుతున్న వీడియోలను షేర్‌ చేసింది. 78 కిలోల బరువు ఎత్తుతున్న వీడియోకు 'హాహాహా.. నేను రోజూ త్వరగానే మేల్కొంటాను. నిన్ను నిరాశపరచాలని నాకు లేదు' అని క్యాప్షన్‌ రాసి నవ్వుతున్న ఎమోజీస్‌ను యాడ్‌ చేసింది సమంత. ఈ క్యాప్షన్‌ను తన జిమ్‌ కోచ్‌ అయిన 'జునాయిడ్‌ షేక్‌' గురించి రాస్తూ అతన్ని ట్యాగ్‌ చేసింది. ఇదిలా ఉంటే సామ్‌ త్వరలో డైరెక్టర్‌ ఫిలిప్‌ జాన్‌తో కలిసి 'అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' అనే సినిమా చేయనుంది. ఇందులో సామ్‌ తన సొంత డిటెక్టివ్‌ ఏజెన్సీని నడిపే ద్విలింగ సంపర్కురాలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: నాగ చైతన్య, సమంత విడాకులు.. డైరెక్టర్‌కు తెచ్చిన కష్టాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement