
కోవిడ్ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చిత్రపరిశ్రమకు చెందిన పలువురూ పని లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకు తాను కూడా అతీతం కానంటోంది దంగల్ నటి ఫాతిమా సనా షైఖ్. ప్రస్తుతం తను కూడా నిరుద్యోగినేనని చెప్పుకొచ్చింది. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'కోవిడ్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులుగా మారారు. కోవిడ్ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత, అంతా తిరిగి సాధారణ స్థితికి వస్తేనే నాకు పని దొరుకుతుంది. అప్పటివరకు నేను నిరుద్యోగినే' అని పేర్కొంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన 'ఫాతిమా చాచీ 420', 'వన్ 2 కా 4', 'తహాన్' చిత్రాల్లో నటించింది. 2006లో వచ్చిన 'దంగల్' సినిమాలోని గీతా ఫొగట్ పాత్రతో ఆమెకు బ్రేక్ వచ్చింది. 'తగ్స్ ఆఫ్ హిందుస్తాన్', 'బిట్టూ బాస్' చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
చదవండి: అతడి చెంప పగలకోడితే.. తిరిగి నన్ను కొట్టాడు: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment