
ఫాతిమా, జాకీ చాన్, సాన్య
మార్షల్ ఆర్ట్స్ అంటే జాకీ చాన్ చేస్తేనే చూడాలి. ఆయన చేసే ఫైట్స్ అంత బాగుంటాయి. సినిమా లవర్స్‌కి, యాక్షన్ లవర్స్‌కి ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. సినిమా స్టార్స్‌లోనూ ఆయన ఫ్యాన్స్ ఉంటారు. ‘దంగల్’ చిత్రంలో నటించిన ఫాతిమా సనా షేక్, సాన్య మల్హోత్రా కూడా జాకీ అభిమానులు. ఆ చిత్రంలో ఈ ఇద్దరూ మల్లయోధులుగా విజృంభించిన సీన్స్‌ని అంత సులువుగా మరచిపోలేం. ఈ యాక్షన్ స్టార్స్ ఇద్దరూ హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్‌ని కలిశారు. చైనాలో జరిగిన జాకీ చాన్ యాక్షన్ మూవీ వీక్‌లో పాల్గొనడానికి ఫాతిమా, సాన్యా వెళ్లారు. అప్పుడు జాకీ చాన్‌ని కలిసి, ఫొటో దిగారు. ‘‘ఓ లెజెండ్‌ని కలిశాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెరీ సింపుల్ పర్సన్’’ అని ఈ ఇద్దరూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment