రావణుడిగా ప్రభాస్‌.. సీతగా దీపికా పదుకోన్‌! | Prabhas as Ravana in Nitesh Tiwari Ramayana | Sakshi
Sakshi News home page

రావణుడిగా ప్రభాస్‌.. సీతగా దీపికా పదుకోన్‌!

Published Wed, Sep 18 2019 2:32 PM | Last Updated on Wed, Sep 18 2019 3:45 PM

Prabhas as Ravana in Nitesh Tiwari Ramayana - Sakshi

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్‌ను ప్రభాస్‌ సొంతం చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన ప్రభాస్‌ ‘సాహో’ సినిమాకు నెటిగివ్‌ టాక్‌, రివ్యూలు వచ్చినా.. కలెక్షన్లు మాత్రం సూపర్బ్‌ అనిపించాయి. ఈ సినిమా సాధించిన వసూళ్లు బాలీవుడ్‌ను సైతం ఔరా అనిపించాయి. 

ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను ఓ ప్రతిష్టాత్మకమైన పురాణ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రామాయణ కథతో ప్రముఖ దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కించబోతున్న సినిమాలో ప్రభాస్‌ రావణుడిగా కనిపించనున్నారని బాలీవుడ్‌లో వినిపిస్తోంది. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బలమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ప్రభాస్‌ ఈ సినిమాకు ఓకే చెప్పలేదని, ఆయన టీమ్‌ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టేకాప్‌ చేయొచ్చా లేదా? అన్నది బేరిజు వేసే పనిలో ఉందని పింక్‌విల్లా వెబ్‌సైట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 

రూ.600 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్‌కు ఉన్న దేశవ్యాప్త స్టార్‌డమ్‌తోపాటు హైట్‌, పర్సనాలిటీ పరంగా రావణుడి పాత్రకు పర్ఫెక్ట్‌గా సూటయ్యే లక్షణాలు ఉండటంతో ఆయనను ఈ సినిమా కోసం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ప్రభాస్‌ రావణుడి పాత్రను చేస్తే.. ఆ పాత్రకు న్యాయం చేయడమే కాకుండా ప్రజల్లో మరింత హైప్‌ వచ్చే అవకాశముంటుందని, మరోవైపు రాముడిగా హృతిక్‌ రోషన్‌, సీతగా దీపికా పదుకోణ్‌ నటించే అవకాశముండటంతో వారికి దీటుగా రావణుడి పాత్రలో ప్రభాస్‌ అలరించే అవకాశముంటుందని బాలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో సీతారాములుగా హృతిక్‌, దీపిక నటించనున్నారని కథనాలు రాగా.. ఇంకా ఈ సినిమా కోసం క్యాస్టింగ్‌ ఫైనల్‌ చేయలేదని ఈ వార్తలను దర్శకుడు నితేశ్‌ కొట్టిపారేశారు. మరోవైపు ఈ సినిమాలో నటించే తారాగణంపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement