రంగులు మార్చుకునే ఈ–బూట్లు
సాక్షి, న్యూయార్క్: రకరకాల రంగుల్లో ఆకర్షణీయమైన స్నీకర్ బూట్లు ధరించడం ఎవరికైనా ఇష్టమే. కొందరు రోజువారి వాడకానికి ఓ జత, పార్టీల కోసం మరో ప్రత్యేక జత బూట్లు ఉండాలని కోరుకుంటారు. వెళ్లే పార్టీనిబట్టి రకరకాల జతల బూట్ల కోసం వెంపర్లాడే వారూ ఉంటారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు ఎక్కువ జతల బూట్లు కొనుక్కోగలరుగానీ అందరికి ఆ ఆస్కారం ఉండదు. ఈ అంశాలను దష్టిలో పెట్టుకుందో, లేదోగానీ ‘షిఫ్ట్‌వియర్’ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్నీకర్ బూట్లు తయారు చేస్తోంది.
ఈ బూట్లపై మనకు నచ్చిన రంగులను ఎప్పటికప్పుడు డిస్‌ప్లే చేయడంతోపాటు, నచ్చిన రంగురంగుల వీడియోలను కూడా డిస్‌ప్లే చేయవచ్చు. దానివల్ల రకకలా బూట్లను ధరించిన అనుభూతిని పొందవచ్చు. సెల్‌ఫోన్‌లోని యాప్ ద్వారా బూట్లపై రంగులను, వీడియోలను డిస్‌ప్లే చేయవచ్చు. అందుకు వీలుగా బూటుపై హై డెఫినేషన్ కలర్ డిస్‌ప్లే ఈ పేపర్ ఉంటుంది. ప్రస్తుతం బూటు మడమ ప్రాంతంలో ఈ డిస్‌ప్లే ఈ పేపర్‌ను ఉపయోగించి ప్రోటోటైప్ బూట్ల జతను తయారు చేసి విజయవంతంగా ప్రదర్శించి చూశారు. మున్ముందు బూటుకు చుట్టూ డిస్‌ప్లే ఈ పేపర్‌ను అరస్తు అంతట మనం కోరుకున్న డిస్‌ప్లేలు వస్తాయి.
ప్రజల నుంచి సేకరించిన మూకుమ్మడి విరాళాల ద్వారా షిఫ్ట్‌వియర్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను 2015లో చేపట్టింది. ఈ ఏడాది చివరి నాటికి బూట్లను తయారుచేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. అత్యంత విలువైనవి, ఖరీదైనవి అవడం వల్ల ఈ బూట్లు కావాలనుకునేవారు అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాలని, జత బూట్లకు 500 డాలర్లని ఆ వర్గాలు చెప్పాయి. డిస్‌ప్లే కోసం బూటుకు కావాల్సిన బ్యాటరీ చార్జింగ్ నడక ద్వారా అవుతుందని, వైఫై, బ్లూటూత్ ద్వారా కూడా సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.