
ఒక పక్షి ఈక విలువెంత? సున్నా అనుకుంటున్నారా? మీరు పొరపాటు పడినట్లే. న్యూజిలాండ్‌లో నిర్వహించిన ఓ వేలంపాటలో పక్షి ఈక అక్షరాలా రూ.23,66,007(28,417డాలర్లు) పలికింది. ఇది పవిత్రమైన హుయియా పక్షి ఈక కావడమే ఇందుకు కారణం. దశాబ్దాల క్రితం నాటి అరుదైన ఈ ఈకను న్యూజిలాండ్‌లోని వెబ్స్ వేలం కేంద్రంలో తాజాగా వేలం వేశారు. ఔత్సాహికుడొకరు సొంతం చేసుకున్నారు.
ఇదొక ప్రపంచ రికార్డు. పిట్ట ఈకకు ఈ స్థాయిలో ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌లోని మవోరీ ప్రజలకు హయియా పక్షిని దైవంగా భావిస్తారు. వారి తెగ పెద్దలు తలపై ఈ పక్షి ఈకలను తలపై కిరీటంగా అలంకరించుకొనేవారు. ప్రజలు బహుమతులుగా ఇచి్చపుచ్చుకొనేవారు. ఈకల క్రయవిక్రయాలు కూడా జరిగేవి. హుయిమా పక్షలు దాదాపు అంతరించిపోయాయి. చివరిసారిగా 1907లో కనిపించినట్లు నిర్ధారణ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment