
ఈ ఫొటోలో కనిపిస్తున్న పురాతన పింగాణీ పాత్రను ఇంగ్లండ్‌లోని డోర్‌చెస్టర్‌కు చెందిన ‘డ్యూక్స్ ఆక్షనీర్స్’ వేలంశాల వేలం వేసింది. వేలంశాల నిర్వాహకులు ఈ పాత్రకు మహా అయితే 100 పౌండ్ల వరకు ధర (రూ.10,565) పలకవచ్చని అంచనా వేశారు. అందువల్ల వేలంపాటను 30 పౌండ్ల (రూ.3,169)నుంచి మొదలుపెట్టారు. వేలంపాటలో వివిధ దేశాల బిడ్డర్లు పాల్గొన్నారు.
నిపుణులైన బిడ్డర్లు కొందరు ఇది చైనాను పాలించిన మింగ్ వంశీకుల నాటి వస్తువని గుర్తించడంతో భారీ స్థాయిలో వేలంపాటను పెంచుకుంటూ పోయారు. చివరకు ఇంగ్లండ్‌కు చెందిన ఒక పురావస్తు సేకర్త దీనిని 1.04 లక్షల పౌండ్లకు (రూ.1.09 కోట్లకు) సొంతం చేసుకున్నాడు. మింగ్ వంశీకులు చైనాను 1368–1644 కాలంలో పాలించారు. వారి హయాంలో తయారైన పింగాణీ వస్తువులు అంత్యంత నాణ్యమైనవి, కళాత్మకమైనవి అని ప్రతీతి.
(చదవండి: ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment