బెంగళూరు: ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో ప్లేయర్లపై కనకవర్షం కురవగా... ఇప్పుడు మహిళల వంతు వచ్చిoది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఐదు ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు.
ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండగా... గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి.
ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అందరికంటే తక్కువగా రూ.2.5 కోట్లు ఉన్నాయి. విదేశీ ప్లేయర్లలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డాటిన్, ఇంగ్లండ్ కెపె్టన్ హీథర్ నైట్ రూ.50 లక్షల కనీస ధరతో వేలానికి రానున్నారు. భారత ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొననుంది. ఢిల్లీకి చెందిన లెఫ్టార్మ్ అన్షు నాగర్ 13 ఏళ్ల వయసులోనే వేలం బరిలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment