సాక్షి, ముంబై: 'హార్లే డేవిడ్‌సన్' ఈ పేరుకి ప్రపంచ మార్కెట్లో పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే అత్యంత ఖరీదైన వెహికల్ తయారీ సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచిన ఈ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం కూడా వాహనాలను తయారు చేసింది అని చాలా తక్కువమందికే తెలుసు.
1908వ సంవత్సరంలో అంటే సుమారు 110 సంవత్సరాల ముందు హార్లే డేవిడ్‌సన్ తయారు చేసిన ఒక వెహికల్ ఇటీవల వేలంలో అక్షరాలా రూ. 7 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజమే. 'ఓల్డ్ ఐస్ గోల్డ్' అంటే ఇదేనేమో..
నిజానికి ఆశ్చర్యం కలిగించే రీతిలో అమ్ముడైన ఈ 'హార్లే డేవిడ్‌సన్ స్ట్రాప్ ట్యాంక్ మోటార్‌సైకిల్' అమెరికాలో లాస్ వెగాస్‌లో మెకమ్ వేలం ద్వారా విక్రయించారు. వేలం పాటలో ఇది 9,35,000 డాలర్లకు అమ్ముడు బోయింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ. 7.73 కోట్లు.
ఈ రకమైన మోటార్ సైకిల్స్‌ని కంపెనీ 1908 లో కేవలం 450 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. అందులో ఒకటే ఇటీవల వేలం పాటలో విక్రయించబడిన హార్లే డేవిడ్‌సన్ స్ట్రాప్ ట్యాంక్ మోటార్ సైకిల్. దాదాపు 110 సంవత్సరాల క్రితం మోటార్‌సైకిల్ ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉండటం విశేషమే మరి.
ఇందులో వీల్స్ , ఇంజిన్ బెల్ట్-పుల్లీ, మఫ్లర్ స్లీవ్, సీటు కవర్ , దాని ఆయిల్ ట్యాంక్ వంటి భాగాలను కూడా ఇందులో స్పష్టంగా చూడవచ్చు. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ వెహికల్స్ కంటే కూడా ఇది చాలా ఖరీదైనది స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment