రూ. 27 కోట్లకు తీసుకున్న సూపర్ జెయింట్స్
ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్‌గా పంత్ రికార్డు
అదరగొట్టిన ‘అయ్యర్’లు
శ్రేయస్‌కు రూ.26 కోట్ల 75 లక్షలు
వెంకటేశ్‌కు రూ.23 కోట్ల 75 లక్షలు
ముగిసిన తొలి రోజు వేలం
బ్యాటింగ్‌లో దూకుడుకు మారుపేరు... వికెట్ కీపర్... కెప్టెన్ గా అనుభవం... ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల నైపుణ్యం... అన్నీ కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిషభ్ పంత్ స్థాయి ఏమిటో చూపించాయి. ఇలాంటి ఆటగాడి కోసమే ఏ జట్టయినా పోటీ పడుతుంది. అందుకే అతని పేరు వచ్చినప్పుడు వేలం వెర్రిగా సాగింది. అతనిపై కోట్లు వెదజల్లేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.
అలా అలా పెరుగుతూ పోయిన ఆ విలువ చివరకు రూ.27 కోట్ల వద్ద ఆగింది. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం చెల్లించి భారత ఆటగాడు రిషభ్ పంత్‌ను సొంతం చేసుకుంది. దాంతో అంతకు కొద్ది నిమిషాల క్రితమే పంజాబ్ కింగ్స్ సంచలన రీతిలో రూ.26 కోట్ల 75 లక్షలకు శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకున్న రికార్డు వెనక్కి వెళ్లిపోయింది.
వీరిద్దరూ భారత జట్టులో సభ్యులుగా ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకోగా... నాలుగు సీజన్లలో అంతంత మాత్రం ఆటనే ప్రదర్శించిన వెంకటేశ్ అయ్యర్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించడం వేలంలో అతి పెద్ద సంచలనం. ఏకంగా 20 మంది ఆటగాళ్లకు రూ.10 కోట్లకంటే ఎక్కువ విలువ దక్కడం విశేషం.
అనూహ్యాలకు వేదికగా నిలిచే ఐపీఎల్ వేలం ఎప్పటిలాగే తమ రివాజును కొనసాగించింది. అర్ష్ దీప్ సింగ్, బట్లర్, కేఎల్ రాహుల్, సిరాజ్, స్టార్క్, స్టొయినిస్, షమీవంటి ప్లేయర్లకు ఆశించిన మొత్తాలే దక్కగా... చహల్, జేక్ ఫ్రేజర్, ఆర్చర్, జితేశ్ శర్మ, రబాడ, నూర్, అవేశ్ ఖాన్‌లకు మాత్రం చాలా పెద్ద మొత్తం లభించింది.
డికాక్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, డేవిడ్ మిల్లర్, మార్క్‌రమ్ తక్కువ మొత్తాలకే సరిపెట్టుకోవాల్సి రాగా... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడైన డేవిడ్ వార్నర్‌ను తొలిరోజు ఎవరూ తీసుకోకపోవడం అత్యంత ఆశ్చర్యకరం!
జిద్దా: ఐపీఎల్–2025 వేలం ఊహించిన విధంగానే కోట్లాది రూపాయల రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తొలి రోజు 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అత్యధిక ధరతో అందరికంటే టాపర్‌గా నిలిచాడు. 2024 వేలంలో మిచెల్ స్టార్క్ (కోల్‌కతా; రూ.24 కోట్ల 75 లక్షలు) నెలకొల్పిన అత్యధిక మొత్తం రికార్డును పంత్ బద్దలు కొట్టాడు.
2024లో కెపె్టన్‌గా కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ (రూ.26 కోట్ల 75 లక్షలు) కాస్త తేడాతో రెండో స్థానంలో నిలవగా... వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించి కోల్‌కతా వెనక్కి తీసుకుంది. భారత ఆటగాళ్లలో అర్ష్ దీప్ సింగ్ తన ప్రస్తుతం టీమ్ పంజాబ్ కింగ్స్‌కే వెళ్లగా... చహల్, కేఎల్ రాహుల్, షమీ, ఇషాన్ కిషన్ కొత్త జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు.
హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ ఎంచుకోగా... కెరీర్ చివర్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన ‘హోం’ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడం విశేషం. సోమవారం కూడా వేలం సాగనుంది. మొత్తం 577 మంది నుంచి మిగిలిన ఆటగాళ్లతో పాటు ఆదివారం అమ్ముడుపోని ఆటగాళ్లు కూడా రెండో రోజు మళ్లీ వేలంలోకి వస్తారు.
పంత్ కోసం పోటీపడ్డారిలా...
తొలి రోజు ఆరో ఆటగాడిగా రూ. 2 కోట్ల కనీస విలువతో పంత్ పేరు వేలంలోకి వచ్చింది. లక్నో ముందుగా తమ ఆసక్తిని చూపించింది. వెంటనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బరిలోకి దిగింది. ఈ రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతూ మొత్తాన్ని రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ దశలో ఆర్‌సీబీ వెనక్కి తగ్గగా... సన్‌రైజర్స్ పోటీకి సిద్ధమైంది.
అలా ఇరు జట్ల మధ్య సాగిన సమరం పంత్ విలువను రూ.20 కోట్ల 75 లక్షల వరకు తీసుకెళ్లింది. ఈ దశలో పంత్ పాత జట్టు ఢిల్లీ అతడిని రైట్ టు మ్యాచ్ ద్వారా మళ్లీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే లక్నో ఏకంగా రూ.27 కోట్ల మొత్తానికి ప్యాడిల్ ఎత్తడంతో పంత్ విలువ శిఖరానికి వెళ్లింది.
శ్రేయస్ అయ్యర్ ముందుగా...
పంత్‌కంటే ముందు రికార్డు ధరతో శ్రేయస్ అయ్యర్ అమ్ముడుపోయాడు. 2024 ఐపీఎల్‌లో కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా అతని పేరు వచ్చింది. గతంలో ఢిల్లీ టీమ్‌లో శ్రేయస్ ఆడినప్పుడు కోచ్‌గా ఉన్న పాంటింగ్ ఈసారి పంజాబ్ తరఫున ముందుగా అతనిపై ఆసక్తిని ప్రదర్శించాడు. ఆపై కోల్‌కతా, ఢిల్లీ మధ్య పోటీ సాగగా... రూ.25 కోట్ల వద్ద ఢిల్లీ సొంతమైనట్లు కనిపించింది. కానీ అనూహ్యంగా మళ్లీ ముందుకొచి్చన పంజాబ్ కింగ్స్ చివరకు బిడ్‌ను ఖాయం చేసుకుంది.
వెంకటేశ్ అయ్యర్ కోసం హోరాహోరీ...
ఐపీఎల్‌లో 2021–24 మధ్య నాలుగు సీజన్ల పాటు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫునే ఆడిన వెంకటేశ్ అయ్యర్ 49 ఇన్నింగ్స్‌లలో 137.12 స్ట్రయిక్‌రేట్‌తో 1326 పరుగులు చేశాడు. 9 ఇన్నింగ్స్‌లలో మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. అప్పుడప్పుడు కొన్ని చెప్పుకో దగ్గ ప్రదర్శనలు ఉన్నా... ఒంటి చేత్తో మ్యాచ్‌ను మార్చగల విధ్వంసకర ఆటగాడైతే కాదు.
కానీ అతని కోసం వేలం అసాధారణ రీతిలో సాగింది. కోల్‌కతా టీమ్ ముందుగా వేలం మొదలు పెట్టింది. లక్నో ముందు ఆసక్తి చూపించినా...ఆ తర్వాత ప్రధానంగా కోల్‌కతా, ఆర్‌సీబీ మధ్యే పోటీ సాగింది. ఇరు జట్లు కలిసి రూ. 20 కోట్లు దాటించాయి. కోల్‌కతా రూ. 23 కోట్ల 75 లక్షలకు చేర్చిన తర్వాత బెంగళూరు స్పందించలేదు.
డేవిడ్ వార్నర్‌కు నిరాశ!
పట్టించుకోని ఫ్రాంచైజీలు
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడు, 184 మ్యాచ్‌లలో 6565 పరుగులతో అత్యధిక స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానం, ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించిన రికార్డుతో పాటు కెపె్టన్‌గా సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించిన ఘనత! ఇలాంటి ఘనాపాటి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్‌ను ఎవరూ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా... అతనేమీ ఆటకు దూరమై చాలా కాలం కాలేదు.
ఇటీవల టి20 వరల్డ్‌కప్ ఆడి చురుగ్గా ఉన్న వార్నర్‌లో ఇప్పటికీ ఈ ఫార్మాట్‌లో చెలరేగిపోగల సత్తా ఉంది.వేలంలో కొందరు అనామక ఆటగాళ్ల కోసం సాగిన పోటీ చూస్తే వార్నర్ కనీస విలువ రూ.2 కోట్లకు కూడా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అనూహ్యం. గత సీజన్‌లో పూర్తిగా విఫలం కావడం వేలంపై ప్రభావం చూపించి ఉండవచ్చు.
తొలి రోజు 12 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు తిరస్కరించగా అందులో వార్నర్, బెయిర్‌స్టో ఎక్కువగా గుర్తింపు పొందిన ఆటగాళ్లు కాగా... ప్రస్తుతం భారత టెస్టు టీమ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్‌పై పెద్దగా అంచనాలు లేవు. మిగిలిన 9 మందిలో పీయూష్ చావ్లా తప్ప ఇతర ఆటగాళ్లు అనామకులే.
అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా
చెన్నై సూపర్ కింగ్స్
నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు)
ఆర్. అశ్విన్ (రూ. 9.75 కోట్లు)
కాన్వే (రూ. 6.25 కోట్లు)
ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు)
రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు)
రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు)
విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్
కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు)
స్టార్క్ (రూ. 11.75 కోట్లు)
నటరాజన్ (రూ. 10.75 కోట్లు)
జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు)
హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు)
అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు)
మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు)
సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు)
కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు)
గుజరాత్ టైటాన్స్
బట్లర్ (రూ.15.75 కోట్లు)
సిరాజ్ (రూ.12.25 కోట్లు)
రబాడ (రూ.10.75 కోట్లు)
ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు)
లోమ్రోర్ (రూ.1.70 కోట్లు)
కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు)
మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు)
అనూజ్ రావత్ (రూ.30 లక్షలు)
నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు)
కోల్‌కతా నైట్‌రైడర్స్
వెంకటేశ్ (రూ.23.75 కోట్లు)
ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు)
డికాక్ (రూ.3.60 కోట్లు)
అంగ్‌కృష్ (రూ.3 కోట్లు)
గుర్బాజ్ (రూ.2 కోట్లు)
వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు)
మర్కండే (రూ. 30 లక్షలు)
లక్నో సూపర్ జెయింట్స్
రిషభ్ పంత్ (రూ.27 కోట్లు)
అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు)
మిల్లర్ (రూ.7.50 కోట్లు)
అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు)
మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు)
మార్క్‌రమ్ (రూ.2 కోట్లు)
ఆర్యన్ జుయాల్ (రూ.30 లక్షలు)
ముంబై ఇండియన్స్
ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు)
నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు)
రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు)
కరణ్ శర్మ (రూ.50 లక్షలు)
పంజాబ్ కింగ్స్
శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు)
అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు)
చహల్ (రూ.18 కోట్లు)
స్టొయినిస్ (రూ.11 కోట్లు)
నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు)
మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు)
వైశాక్ విజయ్ (రూ.1.80 కోట్లు)
యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు)
హర్‌ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు)
విష్ణు వినోద్ (రూ.95 లక్షలు)
రాజస్తాన్ రాయల్స్
జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు)
హసరంగ (రూ.5.25 కోట్లు)
మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు)
ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు)
కార్తికేయ (రూ.30 లక్షలు)
బెంగళూరు
హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు)
ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు)
జితేశ్ శర్మ (రూ.11 కోట్లు)
లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు)
రసిక్ ధార్ (రూ.6 కోట్లు)
సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్
ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు)
మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు)
హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు)
రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు)
మనోహర్ (రూ.3.20 కోట్లు)
ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు)
సిమర్జిత్ సింగ్ (రూ.1.50 కోట్లు)
అథర్వ తైడే (రూ.30 లక్షలు)
టాప్–20 (రూ.10 కోట్లు, అంతకుమించి)
రిషభ్ పంత్ (రూ.27 కోట్లు)
శ్రేయస్ (రూ.26.75 కోట్లు)
వెంకటేశ్ (రూ.23.75 కోట్లు)
అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు)
చహల్ (రూ.18 కోట్లు)
బట్లర్ (రూ.15.75 కోట్లు)
కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు)
ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు)
హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు)
జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు)
సిరాజ్ (రూ.12.25 కోట్లు)
స్టార్క్ (రూ. 11.75 కోట్లు)
ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు)
ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు)
జితేశ్ శర్మ (రూ.11 కోట్లు)
స్టొయినిస్ (రూ.11 కోట్లు)
నటరాజన్ (రూ. 10.75 కోట్లు)
రబాడ (రూ.10.75 కోట్లు)
మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు)
నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు)
తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలంలో దక్కించుకోగా... ఇందులో 24 మంది విదేశీయులు ఉన్నారు. వేలం కోసం మొత్తం రూ.467.95 కోట్లను జట్లు వెచ్చించాయి.
Comments
Please login to add a commentAdd a comment