ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలవుతున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)కు సంబంధించి పురుషుల విభాగం వేలం కార్యక్రమం సోమవారం ముగిసింది. రెండో రోజు బెల్జియం స్టార్ మిడ్‌ఫీల్డర్ విక్టర్ వెగ్‌నెజ్‌కు అత్యధికంగా రూ. 40 లక్షలు లభించాయి.
బెల్జియం జట్టులో కీలక సభ్యుడు
విక్టర్‌ను పంజాబ్‌కు చెందిన సూర్మా హాకీ క్లబ్ కొనుగోలు చేసింది. 28 ఏళ్ల విక్టర్ బెల్జియం తరఫున ఇప్పటి వరకు 175 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన బెల్జియం జట్టులో, 2018 ప్రపంచకప్ సాధించిన బెల్జియం జట్టులో విక్టర్ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు.
మన వాళ్లకు ఎంతంటే?
నెదర్లాండ్స్‌కు చెందిన థియరీ బ్రింక్‌మన్, ఆర్థుర్ వాన్ డోరెన్‌లను కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రూ. 38 లక్షలకు, రూ. 32 లక్షలకు సొంతం చేసుకుంది. భారత యువ ఆటగాడు మొరాంగ్‌థిమ్ రబిచంద్రను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 32 లక్షలకు కొనుగోలు చేసింది.
భారత్‌కే చెందిన అంగద్‌బీర్ సింగ్‌ను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 26 లక్షలకు... హైదరాబాద్ తూఫాన్స్ జట్టు రాజిందర్‌ను రూ. 23 లక్షలకు కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment