గచ్చిబౌలి: ఆలిండియా ఫిన్ స్విమ్మింగ్ ఫెడరేషన్ కప్–2024 పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈ పోటీలను బాలురు, బాలికల విభాగాల్లో వేర్వేరుగా నిర్వహించారు. ఇందులో 50 మీటర్లు, 100, 200, 400 మీటర్లు, 800 మిడ్ రిలే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను అండర్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఇండియా ప్రధాన కార్యదర్శి మయూర్‌పటేల్, యూఎస్‌ఏఐ చీఫ్ జనరల్ సెక్రెటరీ కుల్‌దీప్‌పాటిల్, యూఎస్‌ఎఫ్‌ఏటీ అధ్యక్షురాలు జ్యోతి, ప్రధాన కార్యదర్శి దినేషరాజోరియా ప్రారంభించారు.
ఈ పోటీలను మొదటిసారి నిర్వహిస్తున్నామని, దక్షిణ భారతదేశంలో నిర్వహణకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వ సహకారం మరువలేనిదని జ్యోతి అన్నారు. మూడు రోజులపాటు గచి్చ»ౌలి స్టేడియంలో నిర్వహించే ఈ పోటీలు 11తో ముగుస్తాయన్నారు. 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, పోటీలో ప్రతిభ చాటిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment