ఉత్సవ్‌ దీక్షిత్‌ అరెస్టు | Porsche Crash At KBR Park; Hyderabad Stand-up Comedian Utsav Dixit Arrested, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉత్సవ్‌ దీక్షిత్‌ అరెస్టు

Published Mon, Nov 4 2024 7:34 AM | Last Updated on Mon, Nov 4 2024 10:29 AM

Porsche Crash at KBR Park; Comedian Arrested

బంజారాహిల్స్‌: రోడ్డు ప్రమాదానికి కారకుడైన స్టాండప్‌ కమెడియన్‌ ఉత్సవ్‌ దీక్షిత్‌ (33)ను ఆదివారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్డునంబర్‌–6లో నివసించే ఉత్సవ్‌ దీక్షిత్‌ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన భార్యతో గొడవపడి పోర్షే కారులో బయటకు వచ్చి రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టాడు. కారులో మితిమీరిన వేగంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో తిరిగాడు.

 1వ తేదీ తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–12 నుంచి వెళ్తుండగా బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి సమీపంలో కారు అదుపుతప్పి స్టీరింగ్‌ లాక్‌ కావడంతో డివైడర్‌ను ఢీకొట్టి కేబీఆర్‌ పార్కు ఫెన్సింగ్‌ను దాటుకుని చెట్టు పైకి వెళ్లి కిందపడింది. స్వల్ప గాయాలతో ఉత్సవ్‌ బయటపడి పారిపోయాడు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. 

నిందితుడిపై ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సీజ్‌ చేసి రద్దు చేయాల్సిందిగా ఆర్డీఓకు లేఖ రాశారు. పోలీసుల విచారణలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతోనే కారు అదుపు తప్పినట్లు తేలింది. కాగా.. ఉత్సవ్‌ దీక్షిత్‌ స్టాండప్‌ కమెడియన్‌గా సుపరిచితుడు. పలు కార్యక్రమాల్లో కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఉత్సవ్‌ దీక్షిత్‌ ఇంట్లో భార్యతో గొడవ పడి ఆ కోపాన్ని కారు మీద చూపించినట్లుగా నిర్ధారణ అయింది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement