సాక్షి, హైదరాబాద్: బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.
ఆదివారం ఉదయం 5.30 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ మారథాన్‌లో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. ఒకేసారి 3కే, 5కే, 10కే రన్‌ను నిర్వహించారు. పింక్ మారథాన్‌లో గెలిచిన వారికి మెడల్స్ పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment