మోర్తాడ్(బాల్కొండ): నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడం ద్వారా తన కు ఎలాంటి లాభం లేదనే ఉద్దేశ్యంతోనే నిజామాబాద్ ఎంపీ కవిత రైతు ల ఆశలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఫ్యాక్టరీలను తెరిపించడానికి ప్రభు త్వం జీవో జారీ చేసినా, అమలు చేయకపోవడంపై ఎన్నో అనుమానాలున్నాయని తెలిపారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలనే డిమాండ్‌తో అర్వింద్ ఆధ్వర్యంలో జగిత్యాల్ జిల్లా ముత్యంపేట్‌లో ప్రా రంభమైన చెరుకు రైతుల చర్నాకోల్ మహా పాదయాత్ర.. ఇబ్రహీంపట్నం, వర్షకొండ మీదుగా ఆదివారం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది.
పాదయాత్రకు ఏర్గట్లలో బీజేపీ కార్యకర్తలు, రైతులు ఘన స్వాగతం పలికా రు. ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని సీఎం కేసీఆర్, ఎంపీ కవిత హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా 2015 ఏప్రిల్ 29న జీవో నెం. 28ని జారీ చేశారని తెలిపారు. ఈ జీవో ప్రకారం గతంలో ఫ్యాక్టరీలను నిర్వహించిన యాజమాన్యానికి ప్రభుత్వం ఎంతో కొంత సొ మ్ము చెల్లించి ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు.
అయితే, యజమానులకు రూ.వందల కోట్లు చెల్లిస్తే తమకు ఎలాంటి ప్రయోజనం లేదనే భావనతో కవిత ప్రభుత్వానికి అడ్డం వస్తున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీలను ప్రారంభిస్తే లక్షలాది రైతులతో పాటు వేలాది కార్మికుల, కూలీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కానీ, ఎంపీ కవిత తన స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహుళ ప్రయోజనాలను కలిగించే ఫ్యాక్టరీలను తెరిపించడానికి అడ్డు పడుతోందని ఆరోపించారు.
చక్కెర ఫ్యాక్టరీలను తెరిచే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అర్వింద్ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొటపాటి నర్సింహానాయుడు, నేతలు బస్వా లక్ష్మీనర్సయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్, ఏలేటి నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment