బీజేపీ, టీఆర్‌ఎస్‌ అలయ్‌ బలయ్‌! | TRS BJP Alliance 2019 Elections | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీఆర్‌ఎస్‌ అలయ్‌ బలయ్‌!

Published Sun, Dec 25 2016 12:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ, టీఆర్‌ఎస్‌ అలయ్‌ బలయ్‌! - Sakshi

బీజేపీ, టీఆర్‌ఎస్‌ అలయ్‌ బలయ్‌!

అటు ఢిల్లీలో... ఇటు రాష్ట్రంలోనూ అవే సంకేతాలు
శాసన సభలో టీఆర్‌ఎస్‌పై ఒంటికాలిపై లేచే ఎమ్మెల్యేలు ఇప్పుడు సలహాలు, సూచనలకే పరిమితం
వచ్చే బడ్జెట్‌ సమావేశాలలోపు కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ చేరుతుందని ఊహాగానాలు
అదే జరిగితే కేకే, జితేందర్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు?
ఎంపీ కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజకీ యాల్లో కీలక మార్పులు చోటు చేసుకోను న్నాయా? టీఆర్‌ఎస్‌కి తామే ప్రత్యామ్నాయ మని ఇన్నాళ్లూ ఊదరగొట్టిన బీజేపీ అదే టీఆర్‌ ఎస్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేసిందా..? ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణా మాలు, శాసనసభ సమావేశాల్లో బీజేపీ వైఖరి, టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్‌రావు వివిధ సందర్భాల్లో ఆయా అంశా లపై కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడుతున్న ఉదంతాలు పై ప్రశ్న లకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే బడ్జెట్‌ సమావేశాల నాటికి టీఆర్‌ఎస్‌ కేంద్ర ప్రభుత్వంలో చేరనుం దని సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గా లు అందిస్తున్న సమాచారం మేరకు ఒకవేళ టీఆర్‌ఎస్‌ కేంద్రంలో చేరితే పార్టీ నుంచి రాజ్య సభ సభ్యునిగా ఉన్న కె.కేశవరావు(కేకే), లోక్‌ సభలో పార్టీ నేతగా ఉన్న ఎంపీ జితేందర్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు దక్కడం ఖాయమం టున్నారు. టీఆర్‌ఎస్‌ కేంద్రంలో చేరుతుందని ఏడాదిన్నరగా ప్రచారం జరుగుతూనే ఉంది. సీఎం కేసీఆర్‌ తనయ, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత మంత్రి వర్గంలో చేరుతారన్న ప్రచారమూ బలంగానే సాగింది. మరోమారు టీఆర్‌ఎస్‌ కేంద్రంలో చేరుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య కేంద్ర స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి సమన్వయం కనిపిస్తోంది.

ప్రధాని నిర్ణయానికి సీఎం పూర్తి మద్దతు
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నవంబరు 8న∙ప్రధాని ప్రకటిం చాక వారం 10 రోజుల పాటు ఎలాంటి ప్రక టన చేయకుండా సీఎం కేసీఆర్‌ ఓపికగా ఎదురు చూశారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సీఎం లు ఈ నిర్ణయంపై ఆందోళనలకు దిగగా, దానికి భిన్నంగా కేసీఆర్‌ ప్రధాని అపాయింట్‌ మెంట్‌ తీసుకుని వెళ్లి కలిశారు. ఆ నిర్ణయం నల్లధనాన్ని తుదముట్టించేందుకు తీసుకున్న దని ప్రశంసించడమే కాక ప్రధానికి పూర్తిగా మద్దతు పలికారు. ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే కేబినెట్‌ సమావేశాన్ని ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి, అందులో చర్చించి తానే స్వయంగా విలేకరుల సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. కొద్ది రోజుల తేడా తోనే హైదరాబాద్‌కు వచ్చిన ప్రధానితో వరు సగా 2 రోజులపాటు భేటీ అయ్యారు. దేశ వ్యాప్తంగా చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని విధంగా అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు నోట్ల రద్దుపై చర్చ జరిపారు. ప్రతిప క్షాలు ప్రధాని నిర్ణయాన్ని వేలెత్తి చూపే అవకా శమే ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ఈ నిర్ణయానికి మద్దతుగా సీఎం, శాసన సభ, శాసన మండలి వేదికలుగా తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామాల తర్వాత కేంద్ర బీజేపీ నేతలకు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధి నాయకత్వానికి మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలోనూ అదే తీరు
కాగా,  తమ పార్టీకి చెందిన ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా, ఒక దశలో తమ కంటే ఎక్కువగా మద్దతిస్తున్న కేసీఆర్‌తో, అధి కార పార్టీతో సమన్వయంతో ఉండడానికే బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సహా పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌పై విమర్శల దాడిని దాదాపు పక్కన పెట్టేశారు. శాసన సభ సమావేశాల్లోనూ గతంలో మాదిరిగా అధికార పక్షంపై ఇంతెత్తున లేచే విధానానికి స్వస్తి పలికారు. విమర్శలే ధ్యేయంగా గత సమావేశాల్లో కనిపించిన బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత చర్చల్లో కేవలం సలహాలు, సూచనలు చేయడానికే పరిమితం అవుతున్నారు. జాతీయ రహదారులపై జరిగిన చర్చలో టీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల ప్రసం గాలకు పెద తేడా లేదు. సీఎం కేంద్రంతో సయోధ్యతతో ఉండడాన్ని గమనించిన రాష్ట్ర బీజేపీ, ఇక్కడ తాము కూడా అంతే సయోధ్య గా ఉండడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఎంపీ కవితకు పార్టీలో కీలక బాధ్యత !
టీఆర్‌ఎస్‌ కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందని ప్రచారం జరిగిన ప్రతిసారి ఎంపీ కల్వకుంట్ల కవిత మంత్రి అవుతారని ప్రచారం జరిగేది. అయితే, ఈ సారి దీనికి భిన్నంగా కేకే, జితేందర్‌రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సార్వత్రిక ఎన్ని కలకు మరో రెండేళ్లకు పైగా మాత్రమే గడువు ఉండడంతో టీఆర్‌ఎస్‌ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెడుతోంది. త్వరలో పూర్తి స్థాయిలో పార్టీ కమిటీలను ప్రకటించి రంగంలోకి దించనుంది. ఇప్పుడు ప్రకటిం చబోయే పార్టీ కమిటీలే ఎన్నికలు పూర్తయ్యేదాకా పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పి ఆమె సేవలను పార్టీకే ఉపయోగించుకోనున్నారని తెలు స్తోంది. పార్టీ అధ్యక్షునిగా ఈసారి కూడా సీఎం కేసీఆర్‌ కొనసాగినా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంటి అంతే ప్రాధాన్యం ఉన్న సమాంతర పదవిని కవితకు అప్పజెప్ప నున్నారని విశ్వసనీయ సమాచారం. నిత్యం సీఎం కేసీఆర్‌కు అన్నీ తానై చూసుకునే వీరి కుటుంబానికే చెందిన మరొకరికి కూడా పార్టీలో ప్రాధాన్యం ఉన్న పదవిని ఇచ్చి రంగంలోకి దింపుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement