Cabinet posts
-
టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు ఖరారు!
విజయవాడ, సాక్షి: నరేంద్ర మోదీ ప్రధానిగా.. కొత్తగా కొలువు దీరనున్న కేంద్ర కేబినెట్లో మిత్రపక్షం తెలుగు దేశం పార్టీకి రెండు మంత్రి పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ హోదా, అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ టీడీపీ వర్గాలు లీకులు అందిస్తున్నాయి. ఇక.. టీడీపీ నుండి మరొకరికి అవకాశం ఉండొచ్చనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఇంకా స్పష్టత రాలేదు. కేబినెట్ పదవులతో పాటు లోక్‌సభ స్పీకర్‌గానీ లేదంటే డిప్యూటీ స్పీకర్ పోస్టును సైతం టీడీపీ కోరుతోందన్నది తెలిసిందే. -
కేంద్రంలో కేబినెట్ పదవి.. 2 సహాయ శాఖలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా కొలువుదీరనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూలు అడుగుతున్నన్ని కేబినెట్ బెర్త్‌లు, కీలక శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న టీడీపీ కోరుతున్నట్లుగా ఐదు కేబినెట్ పదవులతో పాటు స్పీకర్ పదవి ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు సమాచారం.టీడీపీకి ఒక కేబినెట్ మంత్రిత్వ శాఖతో పాటు రెండు సహాయక మంత్రి పదవులను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాఖల కేటాయింపుపై చంద్రబాబు శుక్రవారం రెండో దఫా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర పెద్దలతో చర్చించినా సానుకూల ఫలితం దక్కలేదని తెలుస్తోంది.కీలక శాఖలు ఇవ్వలేం..!కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరనున్న మోదీ ప్రభుత్వంలో కీలకమైన హోం, ఆర్ధిక, రక్షణ, రైల్వే, న్యాయ, ఐటీ, రోడ్లు, రహదారుల శాఖలను భాగస్వామ్య పక్షాలకు ఇవ్వకూడదని ఇప్పటికే బీజేపీ పెద్దలు నిరాకరించారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖతో పాటు పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృధ్ధి, ఐటీ కమ్యూనికేషన్లు, నౌకాయాన శాఖలను టీడీపీ కోరినట్లు తెలిసింది. దీనికి అదనంగా స్పీకర్ పదవి కూడా తమకే ఇవ్వాలని అడిగినట్లు జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే బీజేపీ పెద్దలు ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.2014లో మాదిరిగానే పౌర విమానయాన శాఖతో పాటు సహాయ శాఖల్లో కీలక శాఖలు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ కీలక సహాయ శాఖలు ఆర్ధిక లేదా జల శక్తి శాఖ కావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. స్పీకర్ పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని అసలు కేటాయించలేదు. కేవలం స్పీకర్‌తోనే లోక్‌సభ వ్యవహారాలను నిర్వహించగా ప్రొటెం స్పీకర్లతో సభను నడిపించారు. 2014లో మాత్రం అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై, జార్ఖండ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత కరియా ముండా డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించారు. మోదీతోపాటే ప్రమాణం..!మంత్రి పదవులు, శాఖలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు విడిగా చర్చించారు. ప్రాధాన్యతలను ఆయన దృష్టికి తెచ్చారు. నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల్లో తమ పార్టీ వారు కచ్చితంగా ఉండేలా చూడాలని కోరినట్లు తెలిసింది. -
కేబినెట్లో ఆ ముగ్గురికి చోటు దక్కినట్లే(నా)?
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఆ రెండు పార్టీలకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 శాఖలు చొప్పున కేటాయించేలా ఒప్పందానికి వచ్చారు. ఈనెల 6వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తానని సీఎం కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్– జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం భారీగా పోటీ పడుతున్నారు. తమకే మంత్రిమండలిలో బెర్తు ఖరారు కావాలంటూ పార్టీ పెద్దల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దేవెగౌడ ఇంటికి క్యూ జేడీఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలందరు మంత్రి పదవుల కోసం ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. బెంగళూరు నగరంలోని పద్మనాభనగర్లోని దేవేగౌడ నివాసానికి క్యూ కడుతున్నారు. ఆయన ఓకే చేస్తే తమకు బెర్తు ఖరారు అవుతుందని విశ్వాసంతో భారీ లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ నుంచి 37 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. రాహుల్ వద్దనే పంచాయితీ.. అదేవిధంగా కాంగ్రెస్ జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఈమేరకు కొత్త జాబితా తీసుకుని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఢిల్లీ తరలివెళ్లారు. ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి తుది జాబితా ఖరారు చేయనున్నారు. విదేశాల్లో ఉన్న రాహుల్‌గాంధీ శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం కర్ణాటక కాంగ్రెస్ నాయకులతో సమావేశమై మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు ఉండాలి? ఏ శాఖ కేటాయించాలనే దానిపై తుది నిర్ణయానికి వస్తారు. కాంగ్రెస్‌లో మొత్తం 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ముగ్గురికి చోటు దక్కినట్లే(నా)? కర్ణాటకలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్రులు, ఒక బీఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. కాగా వారిలో స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. అలాగే బీఎస్పీ ఎన్నికలకు ముందే జేడీఎస్‌తో జత కట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్, స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేష్, ఆర్.శంకర్‌కు మంత్రివర్గంలో చోటు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురికీ ఏ శాఖలు ఇస్తారనేది ఇంకా తెలియరాలేదు. జేడీఎస్‌లో ఎవరెవరంటే.. జేడీఎస్ సీనియర్ నాయకులు హెచ్డీ రేవణ్ణ, బసవరాజు హొరట్టి, హెచ్.విశ్వనాథ్, బీఎం ఫరూఖ్, సీఎస్ పుట్టరాజు, జీటీ దేవేగౌడ తదితరులకు మంత్రివర్గంలో చోటు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరో వైపు బండప్ప కాశంపూర్, ఏటీ రామస్వామి, హెచ్‌కే కుమారస్వామి, శ్రీనివాసగౌడ, గోపాలయ్య, కంపెనగౌడ నాడెగౌడ, బి.సత్యనారాయణ్, ఎస్ఆర్ శ్రీనివాస్, కేఎం శివలింగేగౌడ, ఎంసీ మనగుళి తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కాంగ్రెస్‌లో మాజీలతో పాటు మరికొందరు.. కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి పదవుల కోసం చాలామంది పోటీలో ఉన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన డీకే శివకుమార్, శామనూరు శివశంకరప్ప, ఆర్వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్, ఎంబీ పాటిల్, కేజే జార్జి, రామలింగారెడ్డి, కృష్ణభైరేగౌడ, రోషన్‌బేగ్, తన్వీర్ సేఠ్, ప్రియాంక ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే తదితరులు ఈసారి కూడా కేబినెట్ బెర్తు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాధ్యక్షులు ఎస్ఆర్ పాటిల్, దినేష్ గుండూరావు, సీనియర్ ఎమ్మెల్యేలు సతీష్ జారకిహోళి, శివానంద పాటిల్, అమరేగౌడ బయ్యాపుర, లక్ష్మీ హెబ్బాళ్కర్, అజయ్‌సింగ్, యశవంతరాయపాటిల్, ఉమేశ్‌యాదవ్, పుట్టరంగశెట్టి, డాక్టర్ సుధాకర్, సీఎస్ శివెళ్లి, అభయ్ప్రసాద్, బసవరాజు పాటిల్ తదితరులు మంత్రి పదవిని ఆశించే వారిలో ఉన్నట్లు సమాచారం. హస్తినకు కాంగ్రెస్ నేతలు ఆదివారం ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీతో సమావేశం కావడానికి కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శనివారం ఢిల్లీ తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ జాబితా ఖరారు చేస్తారు. ఎవరికి ఏ శాఖ ఇస్తారనే దానిపై ఢిల్లీలోనే ఫైనల్ అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమ లేదా మంగళవారం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మంత్రుల జాబితా పూర్తి కానుంది. అనంతరం బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. మంత్రి పదవి అడగలేదు.. తనకు మంత్రి పదవి కావాలని ఎవరినీ అడగలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మంత్రి పదవుల కేటాయింపులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌దే తుది నిర్ణయమని అన్నారు. తనకు ఏ శాఖ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనసులో మాట చెప్పారు. -
బళ్లారి జిల్లాకు 2 మంత్రి పదవులు?
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో ఏర్పాటు కానున్న జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో బళ్లారి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం తెలిసిందే. బళ్లారి ›గ్రామీణ నియోజకర్గం నుంచి నాగేంద్ర, సండూరు నుంచి తుకారాం, హడగలి నుంచి పరమేశ్వర్ నాయక్, విజయనగర నియోజకవర్గం నుంచి ఆనంద్‌సింగ్ ఉన్నారు. వీరిలో కొందరు మంత్రి పదవి కోసం ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నూతన సంకీర్ణ ప్రభుత్వంలో బళ్లారి జిల్లా నుంచి గెలుపొందిన ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ప్రముఖంగా పరమేశ్వర్ నాయక్, నాగేంద్ర, ఆనంద్‌సింగ్, తుకారాంల పేర్లు వినిపిస్తున్నప్పటికీ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రేస్‌లో ఉన్న వారు సీనియర్లు కావడంతో పదవులను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవులపై ఎవరికివారే అంచనాల్లో మునిగిపోయారు. -
నేడు వైఎస్సార్సీపీ నిరసన
⇒నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు ⇒ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమపథం ⇒ఫిరాయింపుదారులకు అగ్రాసనమా..? ⇒ఫిరాయింపు ఎమ్మెల్యేలతోరాజీనామా చేయించాలి ⇒వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి కార్వేటినగరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించాల్సి ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అలా చేయడం లేదన్నారు. ముస్లిం మైనారిటీలు,ఎస్టీలను విస్మరించి వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. అప్రజాస్వామికమైన ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు, నిరసన గళాన్ని వినిపించేందుకు పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. చంద్రబాబు రాక్షస పాలనకు వ్యతిరేకంగా చేపట్టే ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాసామ్యవాదులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ అంశాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రం దష్టికి కూడా తీసుకు వస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్, గవర్నర్ చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. 21మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు విన్నవిస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామం అపహాస్యమైందని, సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలకు తాయిలాలు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శించారు. ఇంత దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదని తెలిపారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజా తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమని పేర్కొన్నారు. -
రేవంత్.. ఇప్పుడు సమాధానం చెప్పాలి
ఆనాడు మంత్రి పదవులపై రాద్ధాంతం చేశావ్.. సీఎం కేసీఆర్‌పై విమర్శలా..! హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చిక్కడపల్లి: వేరే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటున్న రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయంపై సమాధానం చెప్పాలని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గాంధీనగర్ వై జంక్షన్ వద్ద టీఆర్ఎస్ నాయకులు బీఎన్ శ్రీనివాస్‌రావుయాదవ్, పాశం రవి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ నోరెత్తితే కేసీఆర్ టీఆర్ఎస్ను విమర్శిస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా నగరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఒక్క బీజేపీ కార్పొరేటర్‌ను గెలిపించుకోలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ. 9 లక్షలు ఖర్చు అయితే లక్షన్నర చొప్పున ఇస్తున్న బీజేపీ మేమిచ్చాం అనిచెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలో గతంలో రూ. 50 లక్షల సభ్యత్వ నమోదు జరుగగా ఈ సారి ఇప్పటికే 75 లక్షల సభ్యత్వం నమోదైందన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల బీమా ఉంటుందని, ఇప్పటికి ముషీరాబాద్‌లో ముగ్గురికి ఇన్సూరెన్స్ ఇప్పించామన్నారు.కార్యక్రమంలో ముషీరాబాద్ టీఆర్ఎస్ ఇన్చార్జీ ముఠాఘోపాల్, గాంధీనగర్, రాంనగర్ డివిజన్ల కార్పొరేటర్లు ముఠా పద్మనరేష్, వి.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఫిరాయింపుదారులకు కీలక శాఖలు
-
ఒక పార్టీకి ఇబ్బందని చట్టం చేయాలా?
ఫిరాయింపులపై వెంకయ్య సాక్షి, హైదరాబాద్: ‘ఒక పార్టీకి ఇబ్బంది కలిగిందని ఫిరాయింపులపై మరో చట్టం తేవాలా’ అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. సోమవారం మీడియా సమావేశంలో ఏపీలో వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టిన నేపథ్యంలో ఇటువంటి వాటిపై చట్టం తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా అన్న ఒక విలేకరి ప్రశ్నకు వెంకయ్య ఈ విధంగా స్పందించారు. కాగా, ఒక రాజకీయ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాక ఆ పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించి అసలుసిసలైన జాతీయపార్టీగా బీజేపీ నిలిచిందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్, వామపక్షాలు ప్రజాతీర్పును అర్థం చేసుకోలేక తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. మతపరమైన రిజర్వేషన్లు నిలబడవు.. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికోసం చేస్తున్న ప్రయత్నాలు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధం గా నిలబడవని ఒక ప్రశ్నకు వెంకయ్య బదు లిచ్చారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు. రాజ్యాంగాన్ని రూ పొందించే సమయంలోనే అంబేడ్కర్, వల్ల భాయ్ పటేల్ వంటి వారు దీనిని తిరస్క రిం చారన్నారు. సమావేశంలో నేతలు కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, సీహెచ్.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ‘బడుగు వర్గాల అభ్యున్నతే మా లక్ష్యం’ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీలను అభివృద్ధి చేసేందుకు జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హక్కులను కేంద్రం కల్పించిందన్నారు. ప్రస్తుతం ఉన్న పేరిటే కమిషన్‌ను కొనసాగించాలని ఈ సందర్భంగా బీసీ సంఘ ప్రతినిధులు మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సంఘ ప్రతినిధులు గుజ్జ కృష్ణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఫిరాయింపుదారులకు కీలక శాఖలు
- ప్రత్తిపాటి, కొల్లు, శిద్ధా, పరిటాలకు ప్రాధాన్యం తగ్గింపు - లోకేశ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి తమ పార్టీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టించుకోని సీఎం చంద్రబాబు వారికి కీలక శాఖలు కేటాయించారు. సుజయకృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియలకు ముఖ్యమైన శాఖలు కేటాయించారు. ఆదివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 11 మందికి శాఖలు కేటాయించారు.ఇప్పటికే మంత్రులుగా ఉన్న పలువురి శాఖలను చంద్రబాబు మార్చారు. చినబాబుకు కీలకమైన శాఖలు.. కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న తన కుమారుడు లోకేశ్‌కి కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు అప్పగించారు. ఇప్పటివరకూ ఆశాఖ నిర్వహించిన అయ్యన్నపాత్రుడికి అంతగా ప్రాధాన్యం లేని ఆర్అండ్బీ శాఖను అప్పగించడం గమనార్హం. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తొలుత చేపట్టిన శాఖల్నే చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ కు అప్పగించడం విశేషం. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతపై తరచూ వ్యక్తిగత విమర్శలు చేసే అచ్చెన్నాయుడికి రెండు కీలక శాఖలు అప్పగించారు. ఉద్వాసన నుంచి తప్పిం చుకున్న ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, శిద్ధా రాఘవరావులతోపాటు సరిగా పనిచేయడం లేదని భావిస్తున్న పరిటాల సునీతకు అప్రాధాన్య శాఖలిచ్చారు. పుల్లారావు నిర్వహించిన శాఖలను విడగొట్టి సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డిలకు అప్పగించారు. కొల్లు రవీంద్ర వద్ద ఉన్న రెండింటిలో బీసీ సంక్షేమ శాఖను అచ్చెన్నాయుడికి, ఎక్సైజ్‌ను జవహర్‌కు కేటాయించారు. రవీంద్రకు న్యాయ, క్రీడలు, యువజన సర్వీసులు కేటాయించారు. శిద్ధా రాఘవరావు నిర్వహించిన రవాణా, ఆర్ అండ్ బీ శాఖలను విభజించి రవాణా ను అచ్చెన్నాయుడికి, ఆర్‌అండ్‌బీని అయ్యన్న పాత్రుడికి ఇచ్చారు. పరిటాల సునీత చేపట్టిన పౌరసరఫరాల ను పుల్లారావుకు ఇచ్చి ఆమెకు పీతల సుజాత నిర్వహించిన శాఖల్లో ఒకటైన స్త్రీ శిశు సంక్షేమ శాఖను అప్పగించారు. కాల్వకు సమాచార పౌరసంబంధాలు పల్లె రఘునాథ్‌రెడ్డి నిర్వహించిన సమాచార, పౌర సంబంధాలను కాల్వ శ్రీనివాసులకు కేటాయించారు. రావెల కిశోర్‌బాబు నిర్వహించిన సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలను నక్కా ఆనంద్‌బాబుకు, అచ్చెన్నాయు డు నిర్వహించిన కార్మిక శాఖను పితాని సత్యనారాయ ణకు అప్పగించారు. తన వద్దే ఉంచుకున్న విద్యుత్ శాఖను కళా వెంకట్రావుకు, న్యాయ శాఖను కొల్లు రవీంద్రకు, పరిశ్రమల శాఖను అమర్నాథ్రెడ్డికి, పర్యాట క శాఖను అఖిల ప్రియకు బాబు కేటాయించారు. పెట్టుబ డులు, మౌలిక వసతులు, మైనారిటీ సంక్షేమ మాన్ని తన వద్దే ఉంచుకున్నారు. ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పతోపాటు మంత్రు లు నారాయణ, యనమల, గంటా, దేవినేని ఉమతో పాటు మిత్రపక్షం బీజేపీకి చెందిన పైడికొండల మాణి క్యాలరావు, కామినేని శాఖల్లో మార్పు చేయలేదు. -
‘ఇక్కడ వ్యతిరేకించి.. అక్కడ పదవులా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై లొల్లి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం తన మంత్రివర్గంలో ఫిరాయింపుదారులకు చోటివ్వడంపై లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో రాజకీయ అనైతికత, ప్రజాస్వా మ్యం అపహాస్యానికి ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతోందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్, గవర్నర్ సైతం ఈ ఫిరాయింపులను పట్టించుకోక పోవడం దారుణమన్నారు. -
అందరికీ పదవులు రావు
ఆశావహులతో సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: తాను ఎన్నికల కేబినెట్‌ను తయారు చేసుకుంటున్నానని, అందరికీ న్యాయం చేయలేనని సీఎం చంద్రబాబు మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ ఖరారు కావడంతో ఆశావహులు శుక్రవారం అసెంబ్లీలోని చంద్రబాబు కార్యాలయానికి క్యూకట్టారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసంలోనూ బాబును పలువురు కలిశారు. విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అందరిలోనూ ఆశ.. ఉత్కంఠ.. మంత్రి పదవులు ఆశించే వారు తమకు అవకాశం ఇవ్వాలని నేరుగా ఆయన్ను కోరడంతో పాటు తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లారు. పదవులు పోతాయనే ఆందోళనలో ఉన్న మంత్రులు కూడా తమను మంత్రివర్గం నుంచి తొలగించవద్దని విజ్ఞాపనలు చేసుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కేవీ నాయుడు, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, సంధ్యారాణిలు సీఎంను కలసి తమలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీ ఫిరాయించిన వారిని కేబినెట్లో చేర్చుకోవద్దని పరోక్షంగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును ఉద్దేశించి ఆయన్ను కోరారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబీకులతో వచ్చి తనను కేబినెట్లో కొనసాగించాలని కోరగా చూస్తానని సీఎం సమాధానమిచ్చారు. కాగా, చంద్రబాబుకు యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ‘ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్’ పురస్కారాన్ని ప్రకటించింది. మే 8 న కాలిఫోర్నియాలో జరగనున్న సదస్సులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. -
బీజేపీ, టీఆర్ఎస్ అలయ్ బలయ్!
అటు ఢిల్లీలో... ఇటు రాష్ట్రంలోనూ అవే సంకేతాలు ► శాసన సభలో టీఆర్ఎస్పై ఒంటికాలిపై లేచే ఎమ్మెల్యేలు ఇప్పుడు సలహాలు, సూచనలకే పరిమితం ►వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని ఊహాగానాలు ►అదే జరిగితే కేకే, జితేందర్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు? ►ఎంపీ కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీ యాల్లో కీలక మార్పులు చోటు చేసుకోను న్నాయా? టీఆర్ఎస్కి తామే ప్రత్యామ్నాయ మని ఇన్నాళ్లూ ఊదరగొట్టిన బీజేపీ అదే టీఆర్ ఎస్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేసిందా..? ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణా మాలు, శాసనసభ సమావేశాల్లో బీజేపీ వైఖరి, టీఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్‌రావు వివిధ సందర్భాల్లో ఆయా అంశా లపై కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడుతున్న ఉదంతాలు పై ప్రశ్న లకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరనుం దని సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గా లు అందిస్తున్న సమాచారం మేరకు ఒకవేళ టీఆర్ఎస్ కేంద్రంలో చేరితే పార్టీ నుంచి రాజ్య సభ సభ్యునిగా ఉన్న కె.కేశవరావు(కేకే), లోక్ సభలో పార్టీ నేతగా ఉన్న ఎంపీ జితేందర్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు దక్కడం ఖాయమం టున్నారు. టీఆర్ఎస్ కేంద్రంలో చేరుతుందని ఏడాదిన్నరగా ప్రచారం జరుగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంత్రి వర్గంలో చేరుతారన్న ప్రచారమూ బలంగానే సాగింది. మరోమారు టీఆర్ఎస్ కేంద్రంలో చేరుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య కేంద్ర స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి సమన్వయం కనిపిస్తోంది. ప్రధాని నిర్ణయానికి సీఎం పూర్తి మద్దతు దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నవంబరు 8న∙ప్రధాని ప్రకటిం చాక వారం 10 రోజుల పాటు ఎలాంటి ప్రక టన చేయకుండా సీఎం కేసీఆర్ ఓపికగా ఎదురు చూశారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సీఎం లు ఈ నిర్ణయంపై ఆందోళనలకు దిగగా, దానికి భిన్నంగా కేసీఆర్ ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లి కలిశారు. ఆ నిర్ణయం నల్లధనాన్ని తుదముట్టించేందుకు తీసుకున్న దని ప్రశంసించడమే కాక ప్రధానికి పూర్తిగా మద్దతు పలికారు. ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే కేబినెట్ సమావేశాన్ని ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి, అందులో చర్చించి తానే స్వయంగా విలేకరుల సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. కొద్ది రోజుల తేడా తోనే హైదరాబాద్‌కు వచ్చిన ప్రధానితో వరు సగా 2 రోజులపాటు భేటీ అయ్యారు. దేశ వ్యాప్తంగా చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని విధంగా అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు నోట్ల రద్దుపై చర్చ జరిపారు. ప్రతిప క్షాలు ప్రధాని నిర్ణయాన్ని వేలెత్తి చూపే అవకా శమే ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ఈ నిర్ణయానికి మద్దతుగా సీఎం, శాసన సభ, శాసన మండలి వేదికలుగా తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామాల తర్వాత కేంద్ర బీజేపీ నేతలకు, టీఆర్ఎస్ రాష్ట్ర అధి నాయకత్వానికి మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోనూ అదే తీరు కాగా, తమ పార్టీకి చెందిన ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా, ఒక దశలో తమ కంటే ఎక్కువగా మద్దతిస్తున్న కేసీఆర్‌తో, అధి కార పార్టీతో సమన్వయంతో ఉండడానికే బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సహా పార్టీ నాయకులు టీఆర్ఎస్పై విమర్శల దాడిని దాదాపు పక్కన పెట్టేశారు. శాసన సభ సమావేశాల్లోనూ గతంలో మాదిరిగా అధికార పక్షంపై ఇంతెత్తున లేచే విధానానికి స్వస్తి పలికారు. విమర్శలే ధ్యేయంగా గత సమావేశాల్లో కనిపించిన బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత చర్చల్లో కేవలం సలహాలు, సూచనలు చేయడానికే పరిమితం అవుతున్నారు. జాతీయ రహదారులపై జరిగిన చర్చలో టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల ప్రసం గాలకు పెద తేడా లేదు. సీఎం కేంద్రంతో సయోధ్యతతో ఉండడాన్ని గమనించిన రాష్ట్ర బీజేపీ, ఇక్కడ తాము కూడా అంతే సయోధ్య గా ఉండడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంపీ కవితకు పార్టీలో కీలక బాధ్యత ! టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందని ప్రచారం జరిగిన ప్రతిసారి ఎంపీ కల్వకుంట్ల కవిత మంత్రి అవుతారని ప్రచారం జరిగేది. అయితే, ఈ సారి దీనికి భిన్నంగా కేకే, జితేందర్‌రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సార్వత్రిక ఎన్ని కలకు మరో రెండేళ్లకు పైగా మాత్రమే గడువు ఉండడంతో టీఆర్ఎస్ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెడుతోంది. త్వరలో పూర్తి స్థాయిలో పార్టీ కమిటీలను ప్రకటించి రంగంలోకి దించనుంది. ఇప్పుడు ప్రకటిం చబోయే పార్టీ కమిటీలే ఎన్నికలు పూర్తయ్యేదాకా పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పి ఆమె సేవలను పార్టీకే ఉపయోగించుకోనున్నారని తెలు స్తోంది. పార్టీ అధ్యక్షునిగా ఈసారి కూడా సీఎం కేసీఆర్ కొనసాగినా, వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి అంతే ప్రాధాన్యం ఉన్న సమాంతర పదవిని కవితకు అప్పజెప్ప నున్నారని విశ్వసనీయ సమాచారం. నిత్యం సీఎం కేసీఆర్‌కు అన్నీ తానై చూసుకునే వీరి కుటుంబానికే చెందిన మరొకరికి కూడా పార్టీలో ప్రాధాన్యం ఉన్న పదవిని ఇచ్చి రంగంలోకి దింపుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
సీఎం మాటలకు, చేతలకు పొంతన లేదు
తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి హన్మకొండ : సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) జిల్లా అధ్యక్షురాలు బి.రమాదేవి విమర్శించారు. గురువారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ‘మాటలకు చేతలకు పొంతనలేని కేసీఆర్ రెండేళ్ల పాలన’ పేరిట పుస్తకాన్ని తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సీఎం విధానాలవల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, దళి తులు, సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు లేని, ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు వీరబ్రహ్మాచారి, నల్లె ల రాజయ్య, అనిల్, కళ, బాలరాజు, జనగామ కుమారస్వామి, సదానందం, అమరేందర్, ఉమాదేవి, రాజు, రాకేష్, మదుసూధన్, భా రతి, అనంతుల సురేష్, గద్దల సంజీ వ, భిక్షపతి, మంద సంజీవ పాల్గొన్నారు. -
వారికి నిరాశేనా?
► కొత్త వారికి పదవులు రావంటున్న తెలుగుదేశం పార్టీ వర్గాలు ► తాజాగా ఆ పార్టీలో చేరినవారిలోనూ అంతర్మథనం ► పబ్బం గడుపుకోవడానికే బాబు హామీలనే అనుమానాలు ► బావ, తోడల్లుడు.. అందర్నీ కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తూనే ఉన్నారు.. హైదరాబాద్: వారికి నిరాశేనా?... అవుననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. ధన ప్రలోభాలతో విపక్ష ఎమ్మెల్యేలకు ఎరవేసి, వారు పార్టీలో చేరుతున్న సమయంలో మంత్రి పదవులు ఇస్తానంటూ పార్టీ అధినేత హామీ ఇవ్వటాన్ని గమనిస్తున్న టీడీపీ నేతలు ఇది నిజమేనని అంటున్నారు. పార్టీలో చేరిన సుమారు అరడజను మందికి మంత్రి పదవులు ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక పార్టీలో కొనసాగుతున్న అనేకమంది సీనియర్లకు సైతం అనేకమార్లు ఇదే తరహాలో మాటిచ్చారు. అయితే రాజ్యాంగం ప్రకారం అన్ని మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం లేదు. రాష్ర్ట శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో 15 శాతం అంటే సుమారు 26 మందికి మంత్రి పదవులు ఇవ్వవచ్చు. ప్రస్తుత మంత్రివర్గంలో చంద్రబాబుతో కలసి 20 మంది మంత్రులున్నారు. అంటే మరో ఆరుగురిని మాత్రమే కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది. చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తామని హామీనిచ్చిన ఆ పార్టీ నేతల్లో, ఆ పదవిని ఆశిస్తున్న వారిలో సోమిరెడ్డి, పయ్యావుల, ముద్దుకృష్ణమ, కళా వెంక ట్రావు, బుచ్చయ్యచౌదరి, ధూళిపాళ్ల, యరపతినేని, చింతమనేని, బండారు సత్యనారాయణమూర్తి, గౌతు శివాజీ, దామచర్ల జనార్ధన్ తదితరులున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ప్రస్తుతం ఉన్న వారిలో ఒకరిద్దర్ని మినహా ఎక్కువ మందిని తొలగించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. అలాంటప్పుడు కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి మంత్రి పదవి ఇస్తానంటూ బాబు ఇచ్చిన హామీ అమలు ఎలా సాధ్యమని టీడీపీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందరిలోనూ అనుమానాలే: మూడు సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి గత ఏడాది ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలతో ఉన్నారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకునే సమయంలో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు భూమాకు మంత్రి పదవి ఇస్తే రాయలసీమ నుంచి తనకు అవకాశం దక్కదనే అనుమానంతో పయ్యావుల కేశవ్ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఉందనే సాకుతో తనకు మంత్రి పదవి ఎగ్గొట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారనే అనుమానాన్ని కళా వెంకట్రావు తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. కళా సమీప బంధువు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తమ సత్తా ఏమిటో చూపాలని కళా వర్గం ఎదురు చూస్తోంది. చంద్రబాబు ఎంత జంబోజెట్ మంత్రివర్గం ఏర్పాటు చేసినా.. ఆ సందర్భంగా తమకు ఎక్కడ ఉద్వాసన పలుకుతారోనని ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమను మం త్రులు చేస్తామనే హమీని తీసి ఎక్కడ గ ట్టున పెడతారోననే భయాన్ని మంత్రి పదవులు ఆశిస్తున్నవారు వ్యక్తం చేస్తుంటే, మాకు ఇచ్చిన హామీలు పబ్బం గడుపుకోవటానికి ఇచ్చినవేనా అనే సందేహాన్ని తాజాగా టీడీపీలో చే రినవారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే కాదు గత చరిత్ర కూడా అదే.. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని, ఆయన నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని అప్రజాస్వామిక రీతిలో స్వాధీనం చేసుకునే సమయంలో ఆరు నెలల పాటు తాను పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా కొనసాగుతానని, ఆ తరువాత సమర్ధవంతమైన వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెడతానని చెప్పారు. తన బావమరిది, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణకు అధ్యక్ష పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆరు నెలలు కాదు కదా పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న 21 సంవత్సరాల తరువాత కూడా చంద్రబాబే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో హరికృష్ణను మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యేలా చూడాల్సి ఉంది. ఎన్టీ రామారావు మరణంతో ఖాళీ అయిన హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆరు నెలల్లోగా జరగకుండా అడ్డుకుని చివరకు ఆరు నెలల మంత్రిగా హరికృష్ణను మిగిల్చారు. ఇక ఈ పరిణామాల్లో తనకు సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి.. చివరికి పార్టీ నుంచే బైటకు పంపేశారు. గుంటూరు జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ ఆపత్కాలంలో చంద్రబాబు వెన్నంటి నడిచారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు ఇవ్వని చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తొలివిడత జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు ఒక స్థానం ఖాయమని తన నివాసంలో భోజనం పెట్టి మరీ హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ సీట్లకు ఉప, ద్వై వార్షిక ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో ఆయన పేరు కనీసం పరిశీలనకు కూడా రాకపోవడం గమనార్హం. ఇక ప్రకాశం జిల్లాలో పార్టీ సీనియర్ నేత కరణం బలరాంకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సాధారణ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టారు. ఇన్చార్జిలకు మొండిచెయ్యే..! తాజాగా పార్టీలో చేరుతున్నవారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మీకే అని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఇప్పటికే 104 నియోజకవర్గాల్లో పార్టీకి ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలున్నారు.ఈ హామీని బట్టి చూస్తే ప్రస్తుతం ఇన్చార్జిలుగా ఉన్న వారికి చంద్రబాబు మొండి చేయి చూపబోతున్నారన్నది స్పష్టమౌతోంది. చంద్రబాబు ఇచ్చిన హామీ నిజం చేస్తారని అనుకున్నా ప్రస్తుతం పార్టీలో చేరేవారికి, పార్టీ ఇన్చార్జిలుగా ఉన్నవారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చే సే అవకాశం కల్పించాలంటే నియోజకవర్గాల సంఖ్య పెరగాలి. అయితే విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు ఊసెత్తని కేంద్రం నియోజకవర్గాల సంఖ్యను ఎంతవరకు పెంచుతుందో అనుమానమే. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటున్న టీడీపీ నేతలు.. ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర మా అధినేతకు గతంలో లేదు, ఇప్పుడు కూడా ఉండదు అని కుండ బద్ధలు కొట్టినట్టు చెబుతున్నారు. ఆ హామీలు అమలయ్యేవి కాదంటున్న అధికార పక్ష నేతలు ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు వెదజల్లి విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుని హామీలు ఇవ్వాల్సిన అగత్యం ఏమొచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు హామీలను ఆ పార్టీలో చేరినవారు ఎంత నమ్ముతున్నారో తెలియదు కానీ అధికారపక్ష సభ్యులు మాత్రం ఇవి అమలయ్యేవి కాదంటూ బహిరంగంగానే చెబుతున్నారు. తమకు సంవత్సరాల తరబడి ఇస్తూ వస్తున్న హామీలకు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా అతీగతీ లేదని, విపక్ష ఎమ్మెల్యేలు ఇలా చేరిన వెంటనే ఇస్తున్న హామీలను అమలు చేస్తారని ఎలా అనుకుంటామని అధినేతను దగ్గర నుంచి చూసిన టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా పదే పదే మోసం చేయటం చంద్రబాబు నైజమని ఆయన వెంట నడిచిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించారు. -
మాతోశ్రీలోకి ‘నో ఎంట్రీ’..!
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలోకి శివసేన చేరడం ఖాయమని తెలియడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఆ పార్టీ నేతలంతా బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు పెద్ద సంఖ్యలో తరలిరావడం మొదలైంది. రాష్ట్ర నలుమూల నుంచి ఎమ్మెల్యేలందరూ తమ మద్దతుదార్లను వెంటబెట్టుకుని మాతోశ్రీకి వస్తున్నారు. బుధవారం ఉదయం, పగలు, రాత్రి ఇలా అడ్డుఅదుపు లేకుండా మాతోశ్రీకి ఎమ్మెల్యేలు తమ అనుచరగణాలతో తరలిరావడంతో ఉద్ధవ్ ఠాక్రేకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గురువారం కూడా ఇదే తంతు కొనసాగింది. చివరకు ఈ రాకపోకలలో విసుగెత్తిన ఉద్ధవ్ బంగ్లా బయట ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి తన అనుమతి లేనిదే లోపలికి ఎవరినీ అనుమతించకూడదని ఆదేశించారు. దీంతో భద్రతా సిబ్బంది లోపలికి ఎవరిని అనుమతించకపోవడంతో ఎమ్మెల్యేలు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు తమ వాహనాలను బంగ్లాకు దూరంగా పార్కింగ్‌చేసి ఉద్ధవ్ పిలుపుకోసం గేటువద్ద వడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రోడ్డుపై వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో ట్రాఫిక్ జాం సమస్య తలెత్తింది. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలంటే తలప్రాణం తోకకు వస్తోంది. ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క ప్రజాప్రతినిధుల వాహనాలు, మరోపక్క వారి అనుయాయులు ఇలా రోజంతా రోడ్డుపై నిలబడడంతో పోలీసులు వారిని ఏమీ అనలేకపోతున్నారు. కేవలం నిర్ధేశించిన వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇదిలాఉండగా, శివసేన నాయకత్వం ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ లాంటి కీలక పదవులు రాబట్టుకోవడంలో విఫలం కావడంతో కార్యకర్తలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తమ నియోజక వర్గం ఎమ్మెల్యేలను మాతోశ్రీ బంగ్లాలోకి అనుమతించకపోవడంతో వారు మరింత అసహనానికి గురవుతున్నారు. అసెంబ్లీ హాలు ప్రాంగణంలో శుక్రవారం శివసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తేలిపోయింది. దీంతో పైరవీలు చేయడానికి గురువారం ఆఖరు రోజు కావడంతో సాధ్యమైనంత త్వరగా ఉద్ధవ్‌తో భేటీ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఉద్ధవ్‌తో సత్సంబంధాలున్న నాయకులు, సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. -
మోదీ కేబినెట్‌పై ఆరోపణల వెల్లువ
-
ఢిల్లీ ‘చుట్టూ’ కేంద్ర మంత్రులు
* ఎన్సీఆర్లోని అన్ని ప్రాంతాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం * ప్రాజెక్టులు వేగవంతమయ్యే అవకాశం * ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి సాక్షి, న్యూఢిల్లీ: మన్మోహన్సింగ్ కేబినెట్‌తో పోలీస్తే నరేంద్ర మోదీ కేబినెట్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం తగ్గినప్పటికీ జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత లభించింది. తాజా కేబినెట్ విస్తరణలో మహేశ్ శర్మకు మంత్రిపదవి లభించడంతో ఢిల్లీ- ఎన్సీఆర్ నుంచి ఐదుగురికి మంత్రిపదవులు దక్కాయి. దీనితో ఢిల్లీ- ఎన్సీఆర్లో పెండింగులో ఉన్న అనేక ప్రాజెక్టుల అమలులో వేగం వస్తుందన్న ఆశలు మొదలయ్యాయి. ఢిల్లీకి చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన ఐదుగురు మంత్రులలో ఒకరు కేబినెట్ మంత్రి హర్షవర్ధన్ కాగా మిగతా మిగతావారు వీకే సింగ్, రావ్ ఇందర్‌జీత్‌సింగ్, మహేశ్ శర్మ, కృష్ణపాల్ సహాయ మంత్రులుగా ఉన్నారు. వీరిలో జనరల్ వీకే సింగ్ ఘజియాబాద్‌కు, రావ్ ఇందర్జీత్ సింగ్ గుర్గావ్కు, మహేశ్ శర్మ నోయిడాకు, కృష్ణపాల్ ఫరీదాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఐదుగురు మంత్రుల సమన్వయంతో ఢిల్లీ ఎన్సీఆర్ల మధ్య రోడ్డు, రవాణా, నీటిసరఫరా, విద్యుత్తు రంగాలలో ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న ప్రాజెక్టులు వేగం పుం జుకుంటాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, మీరట్, పానిపట్‌లతో ముడిపడిన రాపిడ్ రైలు ప్రాజెక్టుకు పచ్చజెండా లభిస్తుందని, యమునా నది నీటి పంపకంపై హర్యానా ప్రభుత్వంతో వివాదానికి పరి ష్కారం లభిస్తుందని, బవానా విద్యుత్తు ప్లాంటుకు గ్యాస్ లభిస్తుందని, ఈస్టర్న్, వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులు వేగంగా అమలవుతాయని ఆశిస్తున్నారు. అంతేకాక ఈ ఐదుగురు మంత్రుల వల్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగుపడవచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎన్సీఆర్ ప్రాంతాలకు చెందిన నలుగురు మంత్రులు సరిహద్దు నియోజకవర్గాలలోని ఓటర్లను ప్రభావితం చేస్తారని, బీజేపీ వారిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుందని అంటున్నారు. హర్షవర్ధన్ పలుకుబడి కృష్ణానగర్‌తో పాటు చాందినీచౌక్ పరిధిలోని నియోజకవర్గాల ఓటర్లపై ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. అలాగే రావ్ ఇందర్జీత్ సింగ్ దక్షిణఢిల్లీలోని సరిహద్దు నియోజకవర్గాల ఓటర్లను, ముఖ్యంగా జాట్ ఓటర్లను, కృష్ణపాల్ గుర్జర్ గుజ్జర్ ఓటర్లు అధికంగా ఉన్న తుగ్లకాబాద్, బదర్‌పుర్ నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారని వారు అంటున్నారు. నోయిడా ఎంపీ మహేశ్ శర్మ ట్రాన్స్ యమునా ప్రాంతంలోని నియోజకవర్గాలను ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకోగలరని ఆశిస్తున్నారు. ఎన్సీఆర్కు చెందిన నలుగురు మంత్రుల ప్రభావం తుగ్లకాబాద్, బదర్‌పుర్, మెహ్రోలీ, బిజ్వాసన్, ద్వారకా, కోండ్లీ, త్రిలోక్‌పురి, పట్పర్గంజ్, సీమాపురి, షహదరా, రోహతాస్, విశ్వాస్‌నగర్ నియోజకవర్గాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
‘పొత్తు’కు పదవులే అడ్డు..!
* బీజేపీ, శివసేన మధ్య కొనసాగుతున్న చర్చలు * డిప్యూటీ సీఎంతోపాటు 10 మంత్రి పదవులపై పట్టుపడుతున్న శివసేన * 8 మంత్రి పదవులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న బీజేపీ * డిప్యూటీ సీఎం పదవి దగ్గరే ఆగిపోయిన సంప్రదింపులు సాక్షి, ముంబై: బీజేపీతో చేతులు కలిపేందుకు శివసేన సుముఖంగా ఉన్నప్పటికీ ఉపముఖ్యమంత్రి పదవితోపాటు కనీసం 10 మంత్రి పదవులు ఇవ్వాలనిడిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై బీజేపీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి మాత్రం శివసేనను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శివసేన నాయకులతో బీజేపీ నాయకులు శనివారం కూడా ఈ విషయంపై చర్చలు జరిపినట్టు తెలిసింది. అందిన వివరాల మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ టీమ్‌లో మొత్తం 32 మంది మంత్రులుండనున్నారు. వీరిలో ఉపముఖ్యమంత్రితోపాటు 12 మంత్రి పదవులను శివసేన కోరుతోంది. అయితే ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పదవి విషయంపై బీజేపీ, శివసేన చర్చలు ముందుకువెళ్లడంలేదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం 20 మంత్రి పదవులు తమ వద్ద ఉంచుకుని ఎనిమిది మంత్రి పదవులు శివసేనకు, మిగతావి మిత్ర పక్షాలకు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై అధికారికంగా మాట్లాడేందుకు ఎవరు ముందుకురాక పోయినప్పటికీ రాష్ట్రంలో మరోసారి శివసేన, బీజేపీలు కలిసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల విషయంపై దూరమైన మిత్రులు ఎన్నికల ఫలితాల అనంతరం తమ వైఖరిని మార్చుకున్నారు. ముఖ్యంగా బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంలో శివసేన మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు శివసేనకు కూడా బీజేపీతో చేతులు కలపాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో సీట్ల పంపకాల కారణంగా విడిపోయిన శివసేన, బీజేపీలు మంత్రి పదవుల పంపకాలపై సానుకూలంగా వ్యవహరించి ఇద్దరు మళ్లీ ఒక్కటవుతారని పరిశీలకులు భావిస్తున్నారు.