
విజయవాడ, సాక్షి: నరేంద్ర మోదీ ప్రధానిగా.. కొత్తగా కొలువు దీరనున్న కేంద్ర కేబినెట్‌లో మిత్రపక్షం తెలుగు దేశం పార్టీకి రెండు మంత్రి పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ హోదా, అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.
ఈ మేరకు ఢిల్లీ టీడీపీ వర్గాలు లీకులు అందిస్తున్నాయి. ఇక.. టీడీపీ నుండి మరొకరికి అవకాశం ఉండొచ్చనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఇంకా స్పష్టత రాలేదు. కేబినెట్ పదవులతో పాటు లోక్‌సభ స్పీకర్‌గానీ లేదంటే డిప్యూటీ స్పీకర్ పోస్టును సైతం టీడీపీ కోరుతోందన్నది తెలిసిందే.