సాక్షి హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని సీఎల్పీ నాయకుడు మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. పసుపు, ఎర్ర జొన్నల సమస్యలపై నిజామాబాద్ రైతుల గతకొద్దికాలంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు. దేశంలో పసుపు ఉత్పత్తి 33శాతం తెలంగాణలోనే ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పదేపదే ప్రస్తావిస్తారనీ, పసుపు బోర్టును మాత్రం ఏర్పాటుచేయరని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరను కల్పించిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎక్కడ అవసరం వచ్చిన కాంగ్రెస్ శాసనసభ పక్షం అక్కడికి వెళ్తుందని భట్టి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఈనెలాఖరు వరకు ప్రకటిస్తామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై రాష్ట్రస్థాయి నేతలతో చర్చంచి అధిష్టానానికి పంపుతామని, వారి నిర్ణయమే ఫైనల్ అని భట్టి స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment