
కౌలాంలపూర్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర సమితి మలేషియా శాఖ ఏర్పాటు అయింది. ప్రస్తుతానికి పది మందితో అడ్హక్ పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి పార్టీ కమిటీని ఏర్పాటు చేస్తామని మహేష్ బిగల తెలిపారు. ఈ శాఖ ఆవిర్భావ ఏర్పాటుకు ఆకుల శ్యామ్ బాబు (డెన్మార్క్) ఎంతగానో కృషి చేశారని మహేష్ బిగాల తెలిపారు. ప్రస్తుతానికి చిట్టి బాబు చిరుత, కుర్మ మారుతి, గుండ వెంకటేశ్వర్లు, బొడ్డు తిరుపతి, గౌరు రమేష్, బోయిని శ్రీనివాస్, తిప్పర్తి అరుణ్ కుమార్, సుంకపెల్లి సుమన్లతో కూడిన తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment