MLC Kavitha Will Contest From Nizamabad Urban Ahead Of Assembly Elections - Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ అర్బన్‌ బరిలో ఎమ్మెల్సీ కవిత​​​​​​​!

Published Sat, Jul 15 2023 12:30 AM | Last Updated on Sat, Jul 15 2023 1:36 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : రానున్న శాసనసభ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ ప్రారంభించింది. తగిన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఇదిలా ఉండగా ఆయా రాజకీయ పార్టీలు, టిక్కెట్ల ఆశావహులు కా ర్యాచరణను ముమ్మరం చేశారు. జిల్లాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు ఎంఐఎం సైతం నిర్ణయాత్మక ప్రాబల్యం కలిగి ఉన్నాయి. దీంతో పలుచోట్ల బహుముఖ పోటీ, కొన్ని చోట్ల త్రిముఖ, ద్విముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఆయా పార్టీలు ఏఏ స్థానాల్లో పోటీచేస్తే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయనే విషయమై లెక్కలు వేసుకుంటున్నాయి.

నిలబెట్టే అభ్యర్థులను బట్టి ఓట్ల క్రాసింగ్‌కు అవకాశాలు ఉండడంతో పార్టీల్లో గుబులు నెలకొంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎప్పటికప్పుడు వరుస సర్వేలు చేస్తూ ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి పక్షం రోజులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోతుండడంతో వివిధ వర్గాల ప్రజల ఆలోచన సరళి అంతుబట్టడంలేదని పార్టీల నాయకులు చెబుతు న్నారు. దీంతో అన్నిరకాలుగా బలమైన అభ్యర్థుల వేటలో కాంగ్రెస్‌, బీజేపీలు చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. బీఫారాలు కేటాయించే సమయంలోనూ జంపింగ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు అనుగుణంగా అభ్యర్థులు తామున్న పార్టీలో ప్రయత్నాలు చేస్తూనే ఇతర పార్టీల కీలక నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలు సైతం తమకు గట్టి అభ్యర్థి లభించని పక్షంలో ప్రత్యర్థి పార్టీలో టిక్కెట్టు ఆశించి భంగపడిన గట్టి అభ్యర్థిని చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఆటు పార్టీలు, అటు అభ్యర్థులు ప్లాన్‌ ఏ,ప్లాన్‌ బీ, ప్లాన్‌ సీ అనేలా ముందుకు వెళుతున్నారు.

నిజామాబాద్‌ రూరల్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ బరిలో ఉన్నారు. అయితే ఆయన తన కుమారుడు, ధర్పల్లి జెడ్పీటీసీ జగన్‌ను నిలబెట్టేందుకు కేసీఆర్‌ను అడుగుతున్నారు. బీజేపీ నుంచి దినేశ్‌ కులాచారి అభ్యర్థిగా చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి టిక్కెట్టు ఖ రారైనట్లు సమాచారం. ఈ టిక్కెట్టును పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌ రెడ్డి ఆశిస్తున్నారు. సినీ హీరో తన మేనల్లుడు నితిన్‌ ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మళ్లీ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

బోధన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఉండగా ఈసారి టిక్కెట్టును ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాకు ఇస్తారనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి మేడపాటి ప్రకాష్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి రేసులో ఉన్నారు.

ఆర్మూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉ న్నారు. బీజేపీ నుంచి పార్టీలో ఇటీవల చేరిన పైడి రాకేష్‌రెడ్డి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఇక్కడ ప్రొద్దు టూరి వినయ్‌రెడ్డి బీజేపీ టిక్కెట్టు రేసులో ముందు న్నారు. కాంగ్రెస్‌ పార్టీ వినయ్‌రెడ్డిని చేర్చుకుని బరి లోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇక్కడి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు, పలువురు రైతులు కోరుతుండడం గమనార్హం.

బాల్కొండలో మంత్రి వేముల బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌గా ఉన్నారు. బీజేపీ నుంచి ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి తగిన ఏర్పాట్లలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి టిక్కెట్టుకు గట్టి ప్ర యత్నాలు చేస్తున్నారు. అయితే ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డిని చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నెల 20న లేదా నెలాఖరులో సునీల్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ
నిజామాబాద్‌ అర్బన్‌లో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కవిత ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా నడు స్తోంది. బీజేపీ నుంచి ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ టిక్కెట్టు రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహే శ్‌ కుమార్‌గౌడ్‌కు టిక్కెట్టు ఖరారైనట్లు పార్టీ వర్గా ల్లో చర్చసాగుతోంది.

ఈ టిక్కెట్టు కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌, నగర అ ధ్యక్షుడు కేశ వేణు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా సర్వేల మేరకే టిక్కెట్లు అని పీసీసీ నాయకత్వం ఇప్పటి కే ప్రకటించింది. ఈ స్థానం నుంచి ఎంఐఎం బరిలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంఐఎం తరుపున టిక్కెట్టు కోసం బొబ్బిలి నర్స య్య గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్‌ ఇద్రిస్‌ఖాన్‌, జిల్లా అధ్యక్షుడు షకీల్‌పాషా, మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్‌ ఫయీమ్‌, మాజీ కా ర్పొరేటర్‌ రఫత్‌ఖాన్‌ రేసులో ఉన్నారు.

ఆయా పార్టీలు నిలబెట్టే అభ్యర్థులను బట్టి ఓట్ల క్రాసింగ్‌ ఉండనుండడంతో నిజామాబాద్‌ అర్బన్‌ సీటు పై ప్రత్యేక రాజకీయ పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆయా పార్టీల, అభ్యర్థుల పరిస్థితులను బట్టి ఫలితం తారుమారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బహుముఖ పోటీ ఉంటే ఓట్ల చీలిక తీవ్ర ప్రభావం చూపనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement