సిట్టింగుల్లో సర్వే ఫీవర్‌! | - | Sakshi
Sakshi News home page

సిట్టింగుల్లో సర్వే ఫీవర్‌!

Published Sat, May 13 2023 11:02 AM | Last Updated on Sat, May 13 2023 11:02 AM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి : తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎ న్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. అ ధికార బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వేలు చేయించడంలో ముందున్నది. నెలన్నరగా రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సిట్టింగుల్లో ఆందోళన మొదలైంది. జిల్లా లోని ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు.. నియోజకవర్గా ల్లో రాజకీయ పరిస్థితులు.. ప్రజలనాడి తెలుసుకో వడానికి విభిన్న కోణాల్లో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.

కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈ సమ్మేళనాలు ఎలా జరుగుతున్నాయి.. ఎవరెవరు పాల్గొంటున్నారు. పాల్గొన్న నాయకులు ఏం మాట్లాడుతున్నారు.. సమ్మేళనాల్లో క్యాడర్‌ స్పందన ఎలా ఉంది.. అసంతృప్తులు, అసమ్మతి రాగాలు ఎలా ఉన్నాయి.. ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. సిట్టింగులపై క్యాడర్‌లో ఏమంటున్నది.. ఇలా అనే క అంశాలపై బీఆర్‌ఎస్‌ అధినేత సీక్రెట్‌గా సర్వే చే యిస్తున్నట్లు తెలిసింది. తమ పార్టీ పరిశీలకులతో పాటు పార్టీ అనుబంధ పత్రిక ఆధ్వర్యంలో, అలాగే ఐప్యాక్‌ సంస్థ, రాష్ట్ర నిఘా వర్గాలతో సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది. అన్ని సర్వేలు క్రోడీకరించి రా నున్న ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశం ఉన్న ట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీ కోణంలోనే కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన పనితీరుపై ఆరాతీస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వంపై ప్రజల నాడి ఎలా ఉంది.. ఏఏ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది..? ఏఏ వర్గాలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయి..? పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధిపై ప్రజ ల్లో ఎలాంటి స్పందన ఉంది.? పార్టీ కేడర్‌ ఏమ నుకుంటున్నది.. తదితర అన్ని కోణాల్లో అధికార పార్టీ సర్వేలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఏమైనా వివాదాల్లో తలదూరుస్తున్నారా అని కూడా ఆరా తీస్తున్నారు. అన్ని నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ వివిధ రకాలుగా సర్వేలు నిర్వహిస్తూ వస్తోంది.

మూడో కంటికి తెలియకుండా..
బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేలు మూ డో కంటికి తెలియకుండా జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో సర్వే ఫీవర్‌ పట్టుకున్నది. సర్వేలో తేడా వస్తే తమ సీట్లు గల్లంతు అవుతాయని సిట్టింగ్‌లు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్‌లో కొత్త జోష్‌..
కాగా, ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అధికారంలోకి రావాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీనికోసం ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఆయా పార్టీలు పాదయాత్రలు, పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క పాదయాత్రలు చేస్తూ క్యాడర్‌లో జోష్‌ నింపుతున్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర, తరువాత రేవంత్‌రెడ్డి నిర్వహించిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. ఇటీవల రాజధాని హైదరాబాద్‌లో పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీ చేతుల మీదుగా యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించారు. యూత్‌ డిక్లరేషన్‌పై మంచి స్పందన వస్తుండడంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగానే స్పందిస్తున్నారు. కాంగ్రెస్‌కు అన్ని ప్రాంతాల్లో ఓట్‌ బ్యాంక్‌ ఉంది. ఇది ఈసారి తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశపడుతున్నారు.

బీజేపీ దూకుడు..
ఈసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పా వులు కదుపుతోంది. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతోంది. ప్రభుత్వంపై సమరశంకం పూరించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముందున్నారు. ఏ అంశాన్నీ వదులుకోవడం లేదు. హిందుత్వమే ఎజెండాగా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్నది. రైతు భరోసా యాత్ర, నిరుద్యోగ మి షన్‌ మార్చ్‌ వంటి కార్యక్రమాలు చేపడుతుంది. పా ర్టీ కేడర్‌ కూడా ఉత్సాహంగా కార్యక్రమాల్లో భాగమవుతుంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజక వర్గా ల్లో బీజేపీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో మాస్టర్‌ ప్లాన్‌ అంశం, డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ బకాయిలపై పోరాటాలతో జనంలోకి వెళ్లింది. ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో దూకుడుగా వ్యవహరిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement