ఆర్మూర్: రాష్ట్ర రాజకీయాల్లో ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఆర్మూర్ కేంద్రంగా రాజకీయాలు నిర్వహించిన నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు అధిరోహించి చరిత్ర పుటల్లో ఎంతో మంది నాయకులు స్థానం సంపాదించారు. 1952కు ముందే ఆర్మూర్, వేల్పూర్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాల్లోని గ్రామాలను కలుపుతూ ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గ పునర్విభజన కారణంగా తన భౌగోళిక స్వరూపాన్ని మార్చుకుంది. నియోజకవర్గ పరిధిలో ఆర్మూర్ మున్సిపాలిటీ, ఆర్మూర్ మండలం, నందిపేట, మాక్లూర్, ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు ఉన్నాయి. ఇప్పటి వర్గంలో నియోజకవర్గంలో 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఆరుగురు రెడ్డిల ఎమ్మెల్యేలు 61 ఏళ్ల పాటు పాలన కొనసాగించారు.
ముఖ్యమంత్రిగా ఒకరు, మంత్రులుగా ఇద్దరు..
నియోజకవర్గంలో మొదటగా 1952లో సోషలిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అర్గుల్ రాజా రాం బీసీ నాయకుడిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తె చ్చుకున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీ నివాస్, మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి ఆయ న శిష్యులుగా గుర్తింపు పొంది రాజకీయ వారసులుగా ఎదిగారు. కార్మిక నాయకునిగా ఎదిగిన టంగుటూరి అంజయ్య తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా 19 57లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాఽధించారు. తర్వాతి కాలంలో 19 80 అక్టోబర్ 16 నుంచి 1982 ఫిబ్రవరి 24వరకు రా ష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 19 62, 1967, 1972 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పా ర్టీకి చెందిన తుమ్మల రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1978, 1983 ఎన్నికల్లో అర్గుల్ రాజా రాం శిష్యుడిగా రాజకీయ ప్రవేశం చేసిన శనిగరం సంతోష్‌రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజ యం సాధించారు. టీడీపీ స్థాపించి రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన సమయంలో కూడా ఆర్మూ ర్ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సంతోష్‌రెడ్డి విజ యం సాధించి చరిత్ర సృష్టించారు. 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏలేటి మహిపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు సంవత్సరాల పాటు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989 ఎన్నికల్లో శనిగరం సంతోష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.
1990 నుంచి 1991 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, 1991 నుంచి 1992 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా, 1992 నుంచి 1993 వరకు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఏలేటి మహిపాల్‌రెడ్డి మృతితో ఆయన సతీమణి ఏలేటి అన్నపూర్ణ 1994 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శనిగరం సంతోష్‌రెడ్డి శిష్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేసి విజయం సాధించారు.
2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శనిగరం సంతోష్‌రెడ్డి నాలుగో సారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పొత్తులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆర్మూర్ నుంచి ప్రాతినిఽథ్యం వహించిన వారు
1952–57 అర్గుల్ రాజారాం సోషలిస్టు
1957–62 టంగుటూరి అంజయ్య కాంగ్రెస్
1962–67 తుమ్మల రంగారెడ్డి కాంగ్రెస్
1967–72 తుమ్మల రంగారెడ్డి కాంగ్రెస్
1972–79 తుమ్మల రంగారెడ్డి కాంగ్రెస్
1979–83 శనిగరం సంతోష్‌రెడ్డి కాంగ్రెస్
1983–85 శనిగరం సంతోష్‌రెడ్డి కాంగ్రెస్
1985–89 ఏలేటి మహిపాల్‌రెడ్డి టీడీపీ
1989–94 శనిగరం సంతోష్‌రెడ్డి కాంగ్రెస్
1994–99 ఏలేటి అన్నపూర్ణ టీడీపీ
1999–2004 బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్
2004–2009 శనిగరం సంతోష్‌రెడ్డి బీఆర్‌ఎస్
2009–2014 ఏలేటి అన్నపూర్ణ టీడీపీ
2014–2018 ఆశన్నగారి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్
2018–2023 ఆశన్నగారి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్
ప్రత్యేక తెలంగాణలో..
2014లో ప్రత్యేక తెలంగాణలో నిర్వహించిన మొ ట్టమొదటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలుపొందారు. 2018లో రెండో సారి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. 1952 నుంచి 2018 వరకు 15 నిర్వహించిన ఎన్నికల్లో ఒకసారి సోషలిస్టు పార్టీ, ఎనిమిది సార్లు కాంగ్రెస్, మూడు సార్లు టీడీపీ, మూడు సార్లు బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment