'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్‌ గాంధీ | - | Sakshi
Sakshi News home page

'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్‌ గాంధీ

Nov 27 2023 12:46 AM | Updated on Nov 27 2023 8:29 AM

- - Sakshi

మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ

సాక్షి, నిజామాబాద్‌/కామారెడ్డి: తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ‘ప్రజల తెలంగాణ’ కలను నిజం చేయడానికి కామారెడ్డి ప్రజలు రేవంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయభేరి సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. రేవంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసుకుందామన్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడితే తనపై 24 కేసులు పెట్టారని, లో క్‌సభ సభ్యత్వం రద్దు చేసి, తన ఇంటిని లాగేసుకున్నారన్నారు.

రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై ఫోకస్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పేపర్‌ లీకేజీల వరకు బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంల మధ్యనున్న అనుబంధం తదితర అంశాలపై మాట్లాడారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ అన్నారు. సభలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌, అర్బన్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థులు షబ్బీర్‌అలీ, ఏనుగు రవీందర్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్‌, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి: సమయం లేదు మిత్రమా! అభ్యర్థుల హైరానా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement