
సాక్షి, జగిత్యాల : నామీద గెలిచే సత్తా లేకనే కాంగ్రెస్ నాయకులు రైతుల ముసుగులో నామినేషన్లు వేశారంటూ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి ఎంపీ కవిత ఆరోపించారు. పసుపు, ఎర్రజొన్న రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లోక్‌సభ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆరుగురు రైతులు నిజామాబాద్ కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలు కూడా సమర్పించారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన కవిత తన మీద గెలిచే సత్తా లేకనే కాంగ్రెస్ నాయకులు రైతుల ముసుగులో నామినేషన్ వేశారంటూ మండిపడ్డారు. తన మీద నామినేషన్ వేస్తే రైతు సమస్యలు తీరుతాయంటే తనకు అంతకంటే సంతోషం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజల్ని అయోమయానికి గురి చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి 16 మంది ఎంపీలుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment