ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కవిత | Mp kavithaas the best parliamentarian | Sakshi
Sakshi News home page

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కవిత

Published Fri, Feb 1 2019 1:07 AM | Last Updated on Fri, Feb 1 2019 1:07 AM

Mp kavithaas the best parliamentarian - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఫేమ్‌ ఇండియా–ఏషియా పోస్ట్‌ ప్రకటించిన ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు (శ్రేష్ట్‌ సంసద్‌)ను టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కవిత గురువారం ఢిల్లీలో అందుకున్నారు. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవా దృక్పథం, లోక్‌సభకు హాజరు, చర్చల్లో చురు గ్గా పాల్గొనడం, ప్రశ్నలడగడం, పార్లమెంటు నియమ నిబంధనలను పాటించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న సదరు సంస్థ కవితకు అవార్డు ప్రకటించింది. తెలం గాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కవిత క్రీయాశీలకంగా పనిచేస్తున్నారని సంస్థ కొనియాడింది. ఢిల్లీలో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చేతుల మీదుగా కవితతో పాటు మరో 25 మంది ఎంపీలు అవార్డులు అందుకున్నారు. 

బడ్జెట్‌లో రూ. 24 వేల కోట్లు ఇవ్వండి
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, నీతి ఆయోగ్‌ ప్రతిపాదించినట్టు మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలకు రూ. 24 వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే విషయమై శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్న ప్రతిపక్ష పార్టీల తీరును కవిత తప్పుబట్టారు. ఓటమిపాలైన ప్రతిపార్టీ ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నాయన్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఫలితాలు వెలువడక ముందు ప్రభుత్వ ఏర్పాటుకు తమకే మొదటగా అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరిన కాంగ్రెస్‌ నేతలు, ఓటమిపాలవ్వగానే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహా జన్‌ను కలసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి, బూర నరసయ్యగౌడ్, సంతోశ్‌కుమార్, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ పాల్గొన్నారు.

నిజామాబాద్‌ ప్రజలే కారణం
తాను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యానంటే దానికి నిజామాబాద్‌ ప్రజలే కారణమని, గత ఎన్నికల్లో తన ను ఎంపీగా ఎన్నుకోవడం వల్ల సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించగలిగానని కవిత అన్నారు. గురువారం పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై కవిత స్పందిస్తూ.. కేంద్రం చేసిన చిన్నచిన్న పనులను పెద్దగా చూపే ప్రయత్నం జరిగిందని, ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలను ఎక్కడా వెల్లడించలేద న్నారు. నేడు కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెడితే తెలంగాణ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement